
Smriti Mandhana: వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025) నేపథ్యంలో టీమిండియా పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. వరుసగా మూడు మ్యాచ్ లలో కూడా ఓడిపోయింది టీమిండియా. సెమిస్ కోసం పోరాటం చేసిన టీమిండియా మహిళల జట్టు, నిన్న ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. కచ్చితంగా గెలవాల్సిన ఇంగ్లాండు మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ ను గెలిపించేందుకు చాలా కష్టపడ్డ లేడీ కోహ్లీ స్మృతి మందాన కన్నీళ్లు పెట్టుకున్నారు. Smriti Mandhana
Dejected Smriti Mandhana Almost Breaks Down As India Lose Women’s WC Match To England
నాలుగు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించిన నేపథ్యంలో… ఎక్కి ఎక్కి ఏడ్చారు స్మృతి మందాన. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్ లో స్మృతి మందాన 88 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నారు. దాంతో టీమిండియా ఓడిపోయింది. మిడిల్ ఆర్డర్ సరిగ్గా ఆడకపోవడంతో టీమిండియా దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్స్ లో 8 వికెట్లు నష్టపోయి 288 పరుగులు చేసింది. Smriti Mandhana
Also Read: Jubilee Hills by Poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో విష్ణువర్ధన్ రెడ్డి..కేసీఆర్ స్కెచ్…
ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 6 వికెట్లు నష్టపోయి 284 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన ఇంగ్లాండ్ సెమీస్ కు దూసుకు వెళ్ళింది. ఇక టీమిండియా ఓడిపోయినప్పటికీ సెమీస్ అవకాశాలను మాత్రం కలిగి ఉంది. టీమిడియా తన తర్వాతి రెండు మ్యాచ్ లో కచ్చితంగా గెలిస్తే సెమీస్ కు వెళుతుంది. న్యూజిలాండ్ జట్టును కచ్చితంగా టీమిండియా ఓడిస్తేనే ఎవరితో సంబంధం లేకుండా నేరుగా ఫైనల్ కు వెళ్తుంది. Smriti Mandhana
Also Read: Rohit – Kohli: రోహిత్, కోహ్లీ అట్టర్ ఫ్లాప్… గంభీర్ చేసింది కరెక్టే అనిపిస్తోంది…




















