Vishal: జాతీయ అవార్డులపై విశాల్ షాకింగ్ కామెంట్స్.. అవి చెత్తబుట్టలో వేస్తానంటూ..!

Vishal: కోలివుడ్ నటుడు విశాల్ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా తెలిసిన నటుడే.ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగు భాషలో కూడా విడుదలై టాలీవుడ్ లో కూడా మంచి

Vishal shocking comments on the National Awards

Vishal: కోలివుడ్ నటుడు విశాల్ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా తెలిసిన నటుడే.ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగు భాషలో కూడా విడుదలై టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు.అయితే అలాంటి విశాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Vishal shocking comments on the National Awards

అవార్డులను తమ ప్రతిభకు గుర్తింపుగా భావించే సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన విశాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఇక విశాల్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నాకు అవార్డులు అంటే అస్సలు నచ్చవు. ఎందుకంటే 8 కోట్ల మంది ప్రేక్షకులకు నచ్చే సినిమా ఏదో ఎనిమిది మంది డిసైడ్ చేస్తారంటే నేను అస్సలు ఒప్పుకోను.(Vishal)

Also Read: Hero: డూప్ లేకుండా సినిమాలు.. 119 కుట్లు వేయించుకున్న హీరో..!

అలాగే ఇలాంటి అవార్డులు నాకు గనుక వస్తే వాటిని చెత్తబుట్టలో వేస్తాను. వాటిని చెత్త గానే నేను భావిస్తాను. ఏదైనా సరే ప్రేక్షకుల మనసు గెలవాలి. కానీ ఇలా అవార్డులు తీసుకోవడం నాకు ఏమీ నచ్చదు అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. అయితే విశాల్ ఈ మాటలు మాట్లాడడంతో ఈయనకు ఇప్పటివరకు ఎలాంటి అవార్డ్స్ రాలేదని ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని కొంతమంది నెగటివ్ కామెంట్లు పెడుతున్నారు.

Vishal shocking comments on the National Awards

ఇక విశాల్ ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..యాక్షన్ స్టంట్లు చేయడం అంటే ఇష్టమని,అందుకే ఇప్పటివరకు నటించిన ఏ ఒక్క సినిమాలో కూడా డూప్ ని పెట్టుకోలేదని, అలా డూప్ ని పెట్టుకోకుండా యాక్షన్ స్టంట్ లు చేసి ఇప్పటివరకు 119 కుట్లు వేయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆ ఇంటర్వ్యూలో అవార్డులను చెత్తబుట్టలో వేస్తానని మాట్లాడడం సంచలనంగా మారింది.(Vishal)