
Krishna: డీజే టిల్లు మూవీ డైరెక్టర్ కి సూపర్ స్టార్ కృష్ణ కి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే మీరందరూ షాక్ అయిపోతారు. అవును మీరు వినేది నిజమే.డీజే టిల్లు మూవీ డైరెక్టర్ విమల్ కృష్ణ కి హీరో సూపర్ స్టార్ కృష్ణ కి మధ్య సంబంధ ఉందట. అదేలా అంటే డీజే టిల్లు మూవీకి దర్శకత్వం వహించిన తండ్రి శ్రవణ్ కుమార్ చిన్నతనంలో అంటే ఏడవ తరగతి అయిపోయిన సమయంలో ఇంటి నుండి పారిపోయి సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లోనే నాలుగు నెలల పాటు ఉన్నారట.
What is the relationship between DJ Tillu director and superstar Krishna
ఆ తర్వాత శ్రవణ్ కుమార్ కుటుంబ సభ్యులు వెతకగా వెతగ్గా చివరికి కృష్ణ ఇంట్లో ఉన్నాడని తెలిసింది.అలా శ్రవణ్ కుమార్ ని పేరెంట్స్ తిరిగి ఇంటికి తీసుకువెళ్లే సమయంలో బాగా చదువుకొని మంచి పొజిషన్ కి వెళ్ళాలి అని చెప్పారట. అలా కృష్ణ చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకుని శ్రవణ్ కుమార్ మంచి పొజిషన్లోకి వచ్చారు.(Krishna)
Also Read: Renu Desai: పవన్ కళ్యాణ్ వల్ల రేణు దేశాయ్ సంచలన నిర్ణయం.. ఇంకో సంవత్సరమే ఉంటానంటూ.?
ఆ తర్వాత ఆయన కొడుకు కూతురుకి కృష్ణ పేరు కలిసి వచ్చేలా రమ్యకృష్ణ, విమల్ కృష్ణ అని పేరు పెట్టారు. అలా విమల్ కృష్ణ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి వచ్చి డీజే టిల్లు మూవీకి దర్శకత్వం వహించారు. ఇక మొదటి సినిమానే అయినప్పటికీ ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు.

అలా డీజే టిల్లు మూవీ డైరెక్టర్ విమల్ కృష్ణ కి సూపర్ స్టార్ కృష్ణ కి మధ్య విడదీయలేని అనుబంధం ఉందని చెప్పుకోవచ్చు. అలా 45 ఏళ్ల క్రితం శ్రవణ్ కుమార్ మద్రాస్ కి పారిపోయి కృష్ణ ఇంటికి చేరారట.అలా ఈ విషయం 45 ఏళ్ల తర్వాత మరొకసారి వెలుగులోకి వచ్చింది.(Krishna)




















