
Black Beads: హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగిన స్త్రీలు ధరించే మంగళసూత్రం నల్లపూసలు వైవాహిక జీవితానికి ప్రతీక. నల్లపూసలు వివాహం జరిగిన స్త్రీలు ధరించడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. స్త్రీ శరీరంపై నల్లపూసలు ఉండడం వల్ల ఉత్తమ పరిణామాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. నల్లపూసలు స్త్రీలు ఎందుకు ధరించాలి అనే సందేహం చాలా మందికి వస్తూనే ఉంటుంది. నల్లపూసలు స్త్రీలు ధరించడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. Black Beads
Black Beads Why should married women wear black beads
స్త్రీలు నల్లపూసలు ధరించడం వల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి. నల్లపూసలు చెడు దృష్టిని, దిష్టిని తొలగిస్తాయి. ఇవి స్త్రీ చుట్టూ ఉన్న పరిసరాల్లోని దుష్టశక్తులను ప్రతికూలతలను గ్రహిస్తాయి. చెడు దృష్టిని పాల ద్రోలడానికి సహాయం చేస్తాయి. స్త్రీ మెడలో నల్లపూసలు ఉండడం వల్ల భర్తకు ఎలాంటి ఆపద రాకుండా ఉంటుందని పూర్వకాలం నుంచి చాలామంది విశ్వసిస్తారు. భర్తకు రక్షణ కవచంగా ఉండాలని నల్లపూసలు వేసుకుంటారు. వీటిని మెడలో ధరించాలి. నల్లపూసలలో ఉండే బంగారం శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి ప్రతీకగా భావిస్తారు. నల్లపూసలు శివుడికి ప్రతిరూపం శివశక్తుల కలయిక అయిన నల్లపూసలు స్త్రీ, పురుషుల దాంపత్యాన్ని గుర్తుచేస్తాయి. వివాహ సమయంలో వధూవరుల చేత నల్లపూసల దండను నీలలోహిత గౌరీకి పూజలు చేయిస్తారు. గౌరీమాత అనుగ్రహంతో దంపతులు జీవితాంతం అన్యోన్యంగా కలిసి సంతోషంగా ఉంటారని శాస్త్రం చెబుతోంది. Black Beads
Also Read: Mallikarjun Kharge: తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం అసంభవం ?
నల్లపూసలు ధరించడం వల్ల జాతక దోషాలు, సర్ప దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. నల్లపూసలు ధరించడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నల్లపూసలను పూర్వకాలంలో నల్ల మట్టితో తయారు చేసేవారు. ఈ నల్ల మట్టి పూసలు శరీరంపై పడడం వలన శరీరంలో ఉండే వేడి తగ్గుతుందని పెద్దలు చెబుతారు. శరీర వేడి తగ్గడం వలన గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. నల్లపూసల ధారణ స్త్రీల నాడులకు అనుకూలంగా ఉంటుంది. ఇవి శరీరంపై ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. నల్లపూసలు ధరించడం వల్ల నాడీ చురుగ్గా కొట్టుకుంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలను కలిగిస్తుంది. నల్లపూసలు ధరించడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ వేగవంతం అవుతుంది. Black Beads
Also Read: KCR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కంపెయిన్ల లిస్టులో కేసీఆర్.. ఇక కాంగ్రెస్ కు దబిడి దిబిడే




















