Jubilee hills bypoll: వివాదంలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత.. ఈసీకి మాగంటి కుమారుడు ఫిర్యాదు..?

Jubilee Hills by Poll Candidates
Jubilee Hills by Poll Candidates

Jubilee hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హడావిడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంగతి తెలిసిందే. మాగంటి గోపీనాథ్ అకాల మరణం నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుండగా నవంబర్ 14వ తేదీన ఫలితం రానుంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ బరిలో ఉండగా ఆ గులాబీ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ సతీమణి సునీత బరిలో ఉన్నారు. Jubilee hills bypoll

Jubilee hills bypoll BRS candidate Sunitha in controversy

అటు భారతీయ జనతా పార్టీ తరఫున దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే నేటితో నామినేషన్ల పర్వం ముగిసిన నేపథ్యంలో గులాబీ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆమె వేసిన నామినేషన్ తిరస్కరించాలని ఎన్నికల అధికారికి ఫిర్యాదు అందింది. ప్రద్యుమ్న అనే వ్య‌క్తి ఫిర్యాదు నేపథ్యంలో ఈ సంఘటన బయటకు వచ్చింది. అత‌ను ఎవరో కాదు మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు తారక్ ప్రద్యుమ్న. ఇక ఈ ప్రద్యుమ్న ఫిర్యాదు పై డిక్లరేషన్ ఇవ్వనున్నారు మాగంటి సునీత. Jubilee hills bypoll

Also Read: KCR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కంపెయిన్ల లిస్టులో కేసీఆర్.. ఇక కాంగ్రెస్ కు దబిడి దిబిడే

ఈ వివాదానికి కార‌ణం మాగంటి గోపినాథ్ మొదటి భార్య కుమారుడు తారక్ ప్రద్యుమ్న. గోపీనాథ్ చట్టబద్ధంగా తన తల్లి భార్య అంటూ ప్రద్యుమ్న ఫిర్యాదు చేశాడు. సునీత, గోపీనాథ్ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు తప్ప అధికారికంగా పెళ్లి చేసుకోలేదు అంటూ ఆరోపణలు చేశాడు. ఇక గోపీనాథ్ తన తల్లికి విడాకులు ఇవ్వకున్నా సునీత నిజాలను దాచిపెట్టి ఫ్యామిలీ సర్టిఫికెట్ సంపాదించారంటూ ఆరోపణలు చేశాడు. సునిత ఇచ్చిన ఫ్యామిలీ సర్టిఫికెట్లు అక్టోబర్ 11వ తేదీన ఆర్డీవో రద్దు చేశారనుకున్న తారక్ ప్రద్యుమ్న….. సునీత నామినేషన్లు తిరస్కరించాలంటూ ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఇక ఈ సంఘ‌ట‌న‌పై ఎన్నిక‌ల సంఘం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి. Jubilee hills bypoll

Also Read: Mallikarjun Kharge: తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం అసంభవం ?