Vishwak Sen: స్టార్ హీరోలతో పోలిస్తే నీ రేంజ్ ఎంత.. విశ్వక్ సేన్ ని ఏకీపారేస్తున్న నెటిజన్స్.!

Vishwak Sen: ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించిన హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు.. ఆయన నటించిన సినిమాల్లో కొన్ని దారుణంగా

 Netizens are uniting with Vishwak Sen

Vishwak Sen: ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించిన హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు.. ఆయన నటించిన సినిమాల్లో కొన్ని దారుణంగా ఫ్లాప్ అయితే మరికొన్ని సూపర్ హిట్ అయ్యాయి. విశ్వక్ సేన్ ఇప్పటివరకు నటించిన సినిమాల్లో ఫలక్ నామా దాస్ , ఆకాశవనంలో అర్జున కళ్యాణం,హిట్, ఈ నగరానికి ఏమైంది, పాగల్, దాస్ కా ధమ్కీ వంటి చిత్రాల్లో నటించారు. ఇందులో చాలా సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఆయనకు మంచి స్టార్ డం వచ్చింది.

Netizens are uniting with Vishwak Sen

కానీ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి లైలా, మెకానిక్ రాఖీ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.అసలు ఇలాంటి సినిమాలు ఎందుకు ఒప్పుకున్నావు అన్నా అంటూ తిట్టిపోశారు. దీంతో విశ్వక్ సేన్ అభిమానులకు సారీ చెబుతూ లేఖ కూడా విడుదల చేశాడు. అలా పడుతూ లేస్తూ కొనసాగుతున్నటువంటి ఈ హీరోకు కాస్త పొగరు ఎక్కువ అని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. (Vishwak Sen)

Also Read: Ram Charan: రెండోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. ఉపాసన శ్రీమంతం వీడియోలో అది గమనించారా.!

తాజాగా దీపావళి సందర్భంగా విశ్వక్ సేన్ తన ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సమయంలో చాలామంది అభిమానులు తన ఇంటి వద్దకు వచ్చి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో విశ్వక్ సేన్ అభిమానులను ఎంతో ఆప్యాయంగా పలకరించాలి. కానీ మీకు పండగ లేదా రా అంటూ సంబోధించారు. అభిమానుల మాటలను కూడా పట్టించుకోకుండా బాయ్ బాయ్ అంటూ లోపలికి వెళ్లిపోయాడు. నిజానికి పండగపూట వారి ఇంట్లో పండగను కూడా వదిలేసి మన హీరో కోసం వస్తే విశ్వక్ సేన్ ఇలా ప్రవర్తించడం సోషల్ మీడియాలో వివాదానికి దారి తీసింది.

 Netizens are uniting with Vishwak Sen

ఒకటి రెండు హిట్లు పడగానే అంత పొగరు పెరిగిందా.. అభిమానులు అంటే లెక్క లేదా అంటూ విమర్శిస్తున్నారు. స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి పెద్ద పెద్ద హీరోలే అభిమానులు వస్తే ఎంత బిజీగా ఉన్నా వారిని కలిసి ఒక సెల్ఫీ ఇస్తారు. టైముంటే భోజనం కూడా తినేసి వెళ్లండని వారికి అన్ని రకాలుగా ఆదుకుంటారు. కానీ విశ్వక్ సేన్ అలా చేయకుండా వచ్చిన అభిమానులను కనీసం పట్టించుకోకుండా ఎందుకు వచ్చారనే విధంగా ఫేస్ పెట్టి లోపలికి వెళ్లిపోవడం విమర్శలకు దారితీసింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.(Vishwak Sen)