
Curd: పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది ఇది చల్లదనాన్ని ఇస్తుంది. చాలామంది పెరుగు మధ్యాహ్న సమయంలో, రాత్రి సమయంలో తింటూ ఉంటారు. అయితే మధ్యాహ్న సమయంలో ఎండ వేడిమిని తట్టుకోవడానికి పెరుగు తినడం వల్ల కడుపులో ఎంతో హాయిగా ఉంటుంది. పెరుగులో చెడు బ్యాక్టీరియా ఉండదు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగు తినడం వల్ల కండరాల పెరుగుదల బాగుంటుంది. పెరుగు శరీరానికి కావాల్సిన ప్రోటీన్లను అందిస్తుంది. ఎముకలు బలంగా తయారయ్యేలా చేస్తుంది. పెరుగు తినడం వల్ల కాల్షియం అధిక మొత్తంలో రిలీజ్ అవుతుంది. ఇది జీర్ణక్రియకు ఎంతగానో సహాయం చేస్తుంది. పెరుగులో విటమిన్ సి, విటమిన్ డి ఉంటాయి. పెరుగు తినడం వల్ల శరీరంలో ఏర్పడే రక్తపోటు లాంటి సమస్యలు తొలగిపోతాయి. Curd
Reasons to avoid curd at night
అయితే పెరుగు ఆరోగ్యానికి మంచిదే కదా అని రాత్రి సమయంలో తిన్నట్లయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రి సమయంలో పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కొన్ని సందర్భాలలో రాత్రి సమయంలో పెరుగు తినడం వల్ల కడుపునొప్పి వాంతులు, వీరేచనాలు వస్తాయి. ఇక పెరుగులో వేయించిన జీలకర్ర పొడిని కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం సమస్యలను నివారిస్తుంది. అలసట సమస్యలు తొలగిపోతాయి. Curd
Also Read: Jubilee hills bypoll: వివాదంలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత.. ఈసీకి మాగంటి కుమారుడు ఫిర్యాదు..?
రాత్రిపూట పెరుగు తిన్నట్లయితే జలుబు, దగ్గు లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో రాత్రి, ఉదయం పూట పెరుగు తినకపోవడమే మంచిది. కేవలం మధ్యాహ్న సమయంలో మాత్రమే కొద్దిగా తినాలి. రాత్రి పూట పెరుగు తిన్నట్లయితే ఇందులో ఉండే కొవ్వు కారణంగా జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. దీంతో మలబద్ధకం లాంటి సమస్యలు అధికంగా ఏర్పడతాయి. మూత్రపిండ సమస్యలు ఉన్నవారు పెరుగును అసలు తినకూడదు. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది మూత్రపిండ సమస్యలతో బాధపడే వారికి మరింత హానికరం. వీలైనంతవరకు చలికాలంలో, రాత్రిపూట ఉదయం పూట పెరుగు తినకపోవడమే మంచిది. మధ్యాహ్న సమయంలో తిన్నట్లయితే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. Curd
Also Read: Gadari Kishore Kumar: ‘దున్నపోతు’ అని తిట్టినా సిగ్గులేదా? గాదరి కిషోర్ స్ట్రాంగ్ కౌంటర్




















