
Sandeep Vanga: సందీప్ రెడ్డి వంగా — ఈ పేరు వినగానే టాలీవుడ్‌లో ఒక ప్రత్యేక గుర్తింపు గుర్తుకు వస్తుంది. “అర్జున్ రెడ్డి”, “కబీర్ సింగ్”, “యానిమల్” వంటి మూడు చిత్రాలతోనే ఆయన ఇండియన్ సినిమా రంగంలో తనదైన మార్క్ ఏర్పరుచుకున్నారు. ఆయన దర్శకత్వం, టేకింగ్ స్టైల్, Emotional depth అన్నీ కలిపి వంగా సినిమాలను ప్రత్యేకంగా నిలబెడతాయి.
Sandeep Vanga unique Spirit update strategy
ఇటీవల ఆయన ప్రభాస్‌తో చేస్తున్న “Spirit” movie పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఎప్పటిలానే సాయంత్రం లేదా రాత్రి తొలినాళ్లలో అప్‌డేట్ వస్తుందని అందరూ భావించారు. కానీ వంగా తన స్ట్రాటజీని పూర్తిగా మార్చి, అర్ధరాత్రి 11 గంటలకు “Spirit Sound Story” ను సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ఈ Late night update టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. కొద్దిసేపట్లోనే ట్రెండింగ్‌లోకి వెళ్లి, అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. వంగా తీసుకున్న ఈ bold decision ద్వారా “content is king, time doesn’t matter” అన్న తత్వాన్ని చూపించారు.
వంగా ఎప్పుడూ భిన్నంగా ఆలోచిస్తారు. ఇతర దర్శకులు ఫాలో అయ్యే రూట్ కాకుండా, తనదైన దారిలో ప్రయాణిస్తారు. ఈ లేట్ నైట్ రిలీజ్ కూడా అదే దానికి ఉదాహరణ. ఇలాంటివే ఆయన సినిమాలను, ఆయన పేరు చుట్టూ ఏర్పడే క్రేజ్‌ను నిలబెడుతున్నాయి.




















