
Wine Shop: తెలంగాణ రాష్ట్ర మద్యం దుకాణాల దరఖాస్తులలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ముగిసింది. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 95,436 దరఖాస్తులు దాఖలయ్యాయి. గతంతో పోలిస్తే భారీగా 37 వేలు దరఖాస్తుల సంఖ్య తగ్గింది. అటు 218 కోట్ల ఆదాయం భారీగా పెరిగింది. గడువు పెంచడంపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. Wine Shop
Wine Shop Deadline for liquor applications has passed
పెంచిన గడువు రద్దు చేస్తూ తీర్పు వస్తుందేమోనని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్ల కోసం దరఖాస్తులకు గడువు ముగిసేనాటికి 95,436 దరఖాస్తులు దాఖలైనట్లు వెల్లడించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. గతేడాది 1.32 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి భారీగా 37 వేలు తగ్గిపోయింది దరఖాస్తుల సంఖ్య. దరఖాస్తుల సంఖ్య తగ్గినా, టెండర్ ధర రూ.3 లక్షలు చేయడంతో గతంలో కంటే స్వల్పంగా ఎక్కువ ఆదాయం రాబట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. Wine Shop
Also Read: TDP Leader Narayana Rao: తుని బాలిక రేప్ కేసులో ట్విస్ట్..నారాయణరావు ఆత్మహత్య
అక్టోబర్ 18వ తేదీన ముగియాల్సిన దరఖాస్తుల గడువును, ఆశించిన మేరకు ఆదాయం రాలేదని అక్టోబర్ 23వ తేదీ వరకు పొడిగించింది ఎక్సైజ్ శాఖ. గడువు పెంచడం చట్ట విరుద్ధమని దాఖలైన పిటిషన్ పట్ల, నేడు విచారణ జరపనుంది హైకోర్టు. ఇది ఇలా ఉండగా మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తుల గడువు పొడింగపును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పట్ల ఇవాళ విచారణ జరపనుంది హైకోర్టు. Wine Shop
Also Read: Curd: రాత్రిపూట పెరుగుతో తింటున్నారా..అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి ?




















