Ramya Moksha: “నీ పళ్ళ మధ్య గ్యాప్ తగ్గించు”.. రమ్య మోక్షపై టాప్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

Ramya Moksha: పికిల్స్ బిజినెస్ తో ఒక్కసారిగా ముగ్గురు అక్కచెల్లెళ్ల లైఫ్ స్టైల్ మారిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇంస్టాగ్రామ్,యూట్యూబ్ ద్వారా ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ల పేర్లు సోషల్ మీడియా

Top director shocking comments on Ramya Moksha

Ramya Moksha: పికిల్స్ బిజినెస్ తో ఒక్కసారిగా ముగ్గురు అక్కచెల్లెళ్ల లైఫ్ స్టైల్ మారిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇంస్టాగ్రామ్,యూట్యూబ్ ద్వారా ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ల పేర్లు సోషల్ మీడియాలో మార్మోగిపోయాయి.అలా అలేఖ్య చిట్టి పికిల్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించారని చెప్పుకోవచ్చు. వీరు పెట్టిన ఒక తప్పుడు ఆడియో మెసేజ్ కారణంగా ఒక్కసారిగా వైరలయ్యారు. అయితే అలాంటి పికిల్స్ సిస్టర్స్ లో మూడో అమ్మాయి అయినటువంటి రమ్య మోక్ష తాజాగా బిగ్ బాస్ 9 లోకి కటస్టెంట్ గా వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.

Top director shocking comments on Ramya Moksha

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్లిన రమ్య మోక్ష తన ఆట తీరుతో తన మాటలతో అందరితో ఛీ కొట్టించుకుంటుంది. ముఖ్యంగా రమ్యమోక్ష ని ఈ వారం బయటికి పంపించండి అని చాలామంది ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దర్శకుడు గీతాకృష్ణ ఓ ఇంటర్వ్యూలో రమ్య మోక్ష గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రమ్య మోక్ష గురించి గీత కృష్ణ మాట్లాడుతూ.. ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చూస్తున్న టైం లో రమ్య మోక్షని చూశాను. బాగుందని అనుకున్నాను.(Ramya Moksha)

Also Read: Hero: బిగ్ బ్రేకింగ్..స్టార్ హీరో పై చేతబడి.. ఒక్కసారిగా కెరియర్ డౌన్.!

ఆ తర్వాత రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆమె అడ్రస్ కనుక్కోవాలని ఆమె రీల్ చేసిన ఓ మటన్ షాప్ దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయి అడ్రస్ మొత్తం కనుక్కున్నాను. వెంటనే ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేయగా.. ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరండీ అని అడిగింది.దాంతో నా గురించి చెప్పాను.నువ్వు చాలా అందంగా ఉంటావమ్మా.. కాంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్ కి రా అమ్మా అని నేను అంటే రివర్స్లో ఆ అమ్మాయి నన్ను తన ఇంటికి భోజనానికి రమ్మని చెప్పింది. అలాగే నీ పళ్ల మధ్య గ్యాప్ తొలగిస్తే నువ్వు మరింత అద్భుతంగా కనిపిస్తావ్ హైదరాబాదులో చాలా డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి.

Top director shocking comments on Ramya Moksha

ఒకసారి హోటల్ కి రమ్మని చెప్పాను. కానీ ఆ తర్వాత ఆ అమ్మాయి రాలేదు. ఒకరోజు ఆ అమ్మాయి రీల్ చూస్తున్న టైం లో పళ్ళ మధ్య గ్యాప్ పోయింది. తర్వాత మరింత అందంగా కనిపించింది.ఇక ఆమె బిగ్బాస్ కి వెళ్లి ఓ పోస్ట్ పెట్టడంతోనే నేను ఆమెకు కామెంట్ పెడితే కొంతమంది ఆ చీప్ దానితో మీకేంటి అంటూ మాట్లాడారు. కానీ ఇక్కడ ఎవరూ చీప్ కాదు.ఎంతోమంది డైరెక్టర్ల కూతుర్లు, నిర్మాతల కూతుర్లు ఇండస్ట్రీకి వస్తున్నారు.అందరూ చీప్ కాదు.ప్రస్తుతం పికిల్స్ బిజినెస్ నుండి బిగ్ బాస్ లోకి వచ్చిందంటే ఆమె క్రేజ్ ఎంతలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు అంటూ గీత కృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు.(Ramya Moksha)