
Rashmika: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు ఉన్న వారిలో కొంతమందికి మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకునే స్కిల్స్ ఉంటాయి.. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సందీప్ రెడ్డి వంగా.. ఈయన డైరెక్షన్ స్కిల్స్ గురించి మాటల్లో చెప్పడం కష్టం.. ఆయన సినిమాలు చూస్తేనే అర్థం చేసుకుంటారు.. ఇండస్ట్రీలో ఉండే దర్శకులంతా ఒక విధంగా డైరెక్షన్ చేస్తే ఈయన మరో రకంగా డైరెక్షన్ చేస్తారు..
Is that the reason why Sandeep Reddy Vanga rejected Rashmika film
అయితే సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో స్టార్ హీరోలు సైతం చేస్తే బాగుండని అనుకుంటారట.. ఆ విధంగా పేరు తెచ్చుకున్నటువంటి సందీప్ రెడ్డి వంగ ఒక హీరోయిన్ రష్మిక ఆఫర్ ఇస్తే ఆ సినిమాను రిజెక్ట్ చేశారట.. అయితే రష్మిక, సందీప్ రెడ్డి వంగాను డైరెక్ట్ గా కలిసి ఈ సినిమాలో మీరు చేస్తే బాగుంటుందని ఒక అవకాశం కూడా ఇచ్చిందట.. కానీ ఆయన ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించినట్టు సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది.. (Rashmika)
Also Read: Ram Charan: రామ్ చరణ్ కి బిపి వస్తే చేసే పని.. నోట్లో నుండి ఆ పచ్చి బూతు…
రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ది గర్ల్ ఫ్రెండ్, దీన్ని చిలసౌ చిత్రఫేం నటుడు, డైరెక్టర్ అయినటువంటి రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ చేస్తున్నారు.. అయితే ఈ మూవీలో కన్నడ నటుడు అయినటువంటి దీక్షిత్ శెట్టి కథానాయకుడిగా చేసారు.. ఇందులో అను ఇమ్మానుయేల్ కీ రోల్ లో కనిపించనుంది. ఇక ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..అయితే ఈ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ పాత్ర కోసం సందీప్ రెడ్డి వంగాను తీసుకోవాలనుకున్నారట మేకర్స్..

దీనికోసం ఆయనను కలిసి ఆ పాత్ర గురించి చెప్పారట.. అయితే సందీప్ రెడ్డి వంగా మాత్రం ఆ పాత్ర చిన్నదే కావచ్చు అని ముందుగా అనుకున్నారట.కానీ కథ మొత్తం విన్న తర్వాత పాత్ర నిడివి చాలా ఎక్కువగా ఉండడంతో వద్దని రిజెక్ట్ చేశారట.. చివరికి ఆ డైరెక్టర్ చేసేదేమీ లేక తానే ఆ పాత్రలో నటించినట్టు తెలుస్తోంది.. అయితే సందీప్ రెడ్డి వంగాని ఇంతగా బ్రతిమిలాడిన ఆ పాత్ర ఏంటి అనేది మనకు తెలియాలి అంటే తప్పకుండా నవంబర్ 7 న వచ్చే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చూడాల్సిందే.(Rashmika)




















