
CSK: మూడు సంవత్సరాల కుర్రాడికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2035 సంవత్సరంలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో తమ జట్టుకు ఆడాలని చెన్నై సూపర్ కింగ్స్ ఆఫర్ ఇచ్చిందట. క్రికెట్ ఆడడం అంటే మన ఇండియాలో చాలా మంది ఇష్టపడుతారు. పుట్టిన బిడ్డ నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ క్రికెట్ అంటే ఆసక్తి చూపిస్తారు. CSK
CSK has already started scouting for 2035
ఇక రెండు సంవత్సరాల కుర్రాళ్ళు లేదా మూడు సంవత్సరాల చిన్న పిల్లలు బ్యాట్ పట్టుకొని సరదాగా క్రికెట్ ఆడుతూ ఉంటారు. అయితే తాజాగా మూడేళ్ల క్రికెటర్ అందరూ ఆశ్చర్య పడేలా క్రికెట్ షాట్లు ఆడుతున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ తరహాలో హెలికాప్టర్ షాట్లు బాదేస్తున్నాడు. ఈ బుడ్డోడికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. CSK
Also Read: Virat Kohli: కోహ్లీ రెస్టారెంట్ ధరలపై విమర్శలు…ఆస్తులు అమ్ముకోవాలంటూ ఫైర్!
ఈ మూడేళ్ల కుర్రాడి హెలికాప్టర్ షాట్ చూసి, చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు రవీంద్ర జడేజా లాంటి వాళ్లు ఫిదా అయిపోయారు. 2035 ఐపీఎల్ టోర్నమెంటులో సిద్ధంగా ఉండు… తమ జట్టులోకి తీసుకుంటామని చెన్నై సూపర్ కింగ్స్ ఆఫర్ ఇచ్చినట్లు కూడా పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి ఈ బుడ్డోడు చేసిన అరాచకం ఇప్పుడు వైరల్ గా మారింది. CSK
Also Read: Money: ఈ 3 సూత్రాలు పాటిస్తే, కోటీశ్వరులు కావడం పక్కా..?




















