Revanth Reddy: రేవంత్ టంగ్ స్లిప్‌…అజారుద్దీన్ నాయకత్వంలో ఇండియాకు వరల్డ్ కప్ ?

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం వేడి వాడిగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. నిన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో రోడ్ షోలు నిర్వహించి, పబ్లిక్ మీటింగ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని బాంబు పేల్చారు రేవంత్ రెడ్డి. అదే సమయంలో అజారుద్దీన్ మంత్రి పదవిపై స్పందించి అడ్డంగా దొరికిపోయారు సీఎం రేవంత్ రెడ్డి. Revanth Reddy

Revanth Reddy India wins World Cup under Azharuddins leadership

అజారుద్దీన్ నాయకత్వంలో టీమిండియా కు వరల్డ్ కప్ వచ్చిందని ఆయన టంగు స్లిప్ అయ్యారు. దీంతో గులాబీ పార్టీ ఈ వ్యాఖ్యలను బాగానే వాడుకుంటోంది. టీమిండియా కు కపిల్ దేవ్ అలాగే మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీ లో మాత్రమే వరల్డ్ కప్ వచ్చాయి. మొన్న రోహిత్ శర్మ కెప్టెన్సీలో టి20 వరల్డ్ కప్ వచ్చింది. అంతే తప్ప అజారుద్దీన్ కెప్టెన్సీలో ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదు టీం ఇండియా. ఈ విషయం తెలియక రేవంత్ రెడ్డి టంగు స్లిప్పయి మాట్లాడేశారు. దీంతో గులాబీ పార్టీ ఓ రేంజ్ లో ఆడుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి సోయ లేకుండా మాట్లాడుతున్నాడని ఫైర్ అవుతోంది. Revanth Reddy

Also Read: Womens World Cup 2025: వర్షం గండం…ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. విజేత ఎవరంటే ?

అదే సమయంలో అమీర్ పేట మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం పెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ఎన్టీఆర్ విగ్రహం పెడితే అడ్డుపడతారా..? అడ్డుపడే దుర్మార్గులను మూసి నదిలో వేసి బొంద పెడతామని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఎన్టీఆర్ ఆంధ్ర వాడు…అలాంటి వాడి విగ్రహం హైదరాబాదులో ఎందుకని తెలంగాణ ప్రజలు నిలదీస్తున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలను అణగదొక్కాడని గుర్తు చేస్తున్నారు. ఏ ఆంధ్ర నాయకుడైనా సరే… తెలంగాణకు ఎప్పుడు కూడా న్యాయం చేయలేదని చెబుతున్నారు. Revanth Reddy

Also Read: Congress: తెలంగాణలో మరో రెండు మంత్రి పదవులు.. ఎవరికి ఛాన్స్ అంటే ?