Chilli: కారం ఎక్కువగా తింటున్నారా? అయితే య‌ముడికి డోర్ తెరిచిన‌ట్లే ?

Chilli: కారం తినే అలవాటు కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. మరి కొంతమంది అసలు కారం తినలేరు. అయితే కారం ఎక్కువగా తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అతిగా కారం తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు ముప్పు వాటిల్లుతుంది. కారం పొడిని ఎక్కువగా అలవాటు ఉన్నట్లయితే దానిని నెమ్మది నెమ్మదిగా తగ్గించుకోవాలి. కారం ఎక్కువగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం ఎక్కువగా పడుతుంది. కారం పొడిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో మంట ఏర్పడుతుంది. కారం ఎక్కువగా తినడం వల్ల గ్యాస్ తయారు అవుతుంది. దానివల్ల జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. Chilli

Chilli peppers offer numerous health benefits

కారం ఎక్కువగా తినే వారికి వీరేచనాలు అవుతాయి. కండరాల నొప్పి, తిమ్మిర్లు వస్తాయి. సున్నితమైన కడుపు లేదా ప్రేగుల సమస్యలు ఉన్నవారు కారం అసలు తీసుకోకూడదు. కారం ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు పెరుగుతాయి. ముఖ్యంగా కారం ఎక్కువగా తినడం వల్ల పెద్ద ప్రేగులోని కణాలకు నష్టం కలుగుతుంది. కారం ఎక్కువగా తినే అలవాటు ఉంటే దానిని పూర్తిగా మానుకోవాలి. కారం ఎక్కువగా తిన్నట్లయితే ర్మం పైన ఎలర్జీ దద్దుర్లు ఏర్పడతాయి. గొంతులో మంట పుడుతుంది. కారం ఎక్కువగా తిన్నట్లయితే వాపులు లేదా ఇతర అలర్జీ సమస్యలకు దారితీస్తుంది. Chilli

Also Read: Womens World Cup 2025: ఛాంపియ‌న్ గా ఇండియా…భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించిన బీసీసీఐ..ఎన్ని కోట్లంటే

కారం ఎక్కువగా తిన్నట్లయితే బీపీ సమస్యలు ఏర్పడతాయి. కారం తిన్న వెంటనే శరీరంలో ఉష్ణోగ్రత అధికంగా పెరుగుతుంది. దానివల్ల చర్మం ఎర్రబడడం, స్కిన్ ఎలర్జీ, డీహైడ్రేషన్, కొన్ని సందర్భాలలో తల పట్టినట్టుగా అనిపిస్తుంది. అధిక రక్తపోటు లేదా గుండె సంబంధ సమస్యలతో బాధపడేవారు గ్యాస్, అల్సర్ లాంటి సమస్యలు ఉన్నవారు కారంపొడిని తినడం పూర్తిగా మానుకోవాలి. ప్రతిరోజు ఎక్కువ పరిమాణంలో కారం తీసుకుంటే అది ఆరోగ్యానికి హానికరం. కేవలం కారంపొడిని రుచి కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాడుకోవాలి. అలాంటి సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. Chilli

Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోవ‌డ‌మే.. జ‌గ్గారెడ్డి సంచ‌ల‌నం ?