KK Survey: కేకే సర్వేను టార్గెట్ చేసిన ఎల్లో మీడియా ?

KK Survey: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో కేకే సర్వే తమ రిపోర్టును బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్టు ప్రకారం గులాబీ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోతుందని కేకే సర్వే స్పష్టం చేసింది. గులాబీ పార్టీ 18 శాతం ఓట్ల తేడాతో విజయం సాధించబోతుందట. KK Survey

Yellow media targets KK Survey

అంటే 30 నుంచి 40 వేల మెజారిటీ రానుంది అన్నమాట. ఇప్పటికిప్పుడు ఏదైనా అద్భుతం జరిగినా కూడా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని కేకే సర్వే స్పష్టం చేసింది. అయితే గులాబీ పార్టీకి కేకే సర్వే అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఎల్లో మీడియా సరికొత్త కుట్రలకు తెరలేపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేకే సర్వేను టార్గెట్ చేస్తూ వాళ్లకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతోంది ఎల్లో మీడియా. రకరకాల ఆర్టికల్స్ కూడా రాపిస్తోంది. మరో ఆరా మస్తాన్ అంటూ కేకే సర్వే పరువు తీస్తోంది.KK Survey

Also Read: Womens World Cup 2025: ఛాంపియ‌న్ గా ఇండియా…భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించిన బీసీసీఐ..ఎన్ని కోట్లంటే

గులాబీ పార్టీ, వైసీపీ పార్టీకి అనుకూలంగా ఎవరు వ్యవహరించినా కూడా ఎల్లో మీడియా రెచ్చిపోతుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని మరి కొంత మంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేకే సర్వే చెప్పింది నిజమవుతుందని అంటున్నారు. కాగా కూటమి ఏపీలో అధికారంలోకి వస్తుందని ముందుగా చెప్పింది కేకే సర్వే అన్న సంగతి తెలిసిందే. అప్పుడు కేకే సర్వే బాగుందని చెప్పిన ఎల్లో మీడియా, ఇప్పుడు చేదు అయిపోయిందని ప్లేట్ మార్చడం ఏంటని విశ్లేషకులు అంటున్నారు. KK Survey

Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోవ‌డ‌మే.. జ‌గ్గారెడ్డి సంచ‌ల‌నం ?