
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అభివృద్ధే ఆయుధంగా ప్రజా ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోంది. మొత్తం 3.98 లక్షల ఓటర్లలో దాదాపు లక్ష కుటుంబాలు ప్రభుత్వం అందిస్తున్న welfare schemes లబ్ధిదారులుగా మారాయి. ఆరు గ్యారంటీలతో పాటు Rice Scheme, Free Electricity వంటి పథకాలు అధికార పార్టీకి బలమైన ఓటు బ్యాంక్‌గా నిలిచాయి.
ప్రజల జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. 25,925 కుటుంబాలు ఉచిత విద్యుత్ లబ్ధి పొందుతుండగా, 19,658 కుటుంబాలు రూ.500కి గ్యాస్ సిలిండర్ పొందుతున్నాయి. Zero Ticket Travel పథకం ద్వారా మహిళలు కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలోని మహిళలు మాత్రమే రూ.120 కోట్లు సేవ్ చేశారు.
సామాజిక భద్రతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం 14,197 కొత్త రేషన్ కార్డులు జారీ చేసింది. ఇందిరమ్మ ఆసరా కింద 11,328 మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ప్రతినెలా పెన్షన్ పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో Indiramma Canteen Breakfast Scheme ద్వారా రోజూ 25 వేల మందికి లబ్ధి కలుగుతోంది.
మౌలిక వసతుల పరంగా కూడా జూబ్లీహిల్స్ వేగంగా మారుతోంది. Flyovers and Underpasses నిర్మాణానికి రూ.826 కోట్లు, నల్లా నీటి సరఫరా పనులకు రూ.6.43 కోట్లు, విద్యుత్ లైన్ అప్‌గ్రేడ్ కోసం రూ.11 కోట్లు కేటాయించబడ్డాయి. ఈ development projectsతో జూబ్లీహిల్స్ నగరంలో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది.




















