Maganti Sunitha: మాగంటి సునీత సంచలన లేఖ‌ వైరల్ ?

Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో గులాబీ పార్టీకి కొత్త చిక్కులు వచ్చాయి. తాజాగా గులాబీ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థి మాగంటి సునీత రాసిన సంచలన లేఖ‌ బయటకు వచ్చింది. ఏఐజి ఆసుపత్రికి ఆమె లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రచారం జోరుగా చేస్తోంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఈ లేఖ‌ బయటకు రావడం గమనార్హం. Maganti Sunitha

Maganti Sunitha sensational letter goes viral

మాగంటి గోపీనాథ్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో తన సొంత తల్లి అలాగే కుటుంబ సభ్యులను ఆస్పత్రిలోకి అనుమతించకూడదని మాగంటి సునీత సంచలన లేఖ రాశారట. మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆసుపత్రికి రాకుండా చూసుకోవాలని ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బందికి మాగంటి సునీత రాసినట్లు కాంగ్రెస్ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ లేఖ‌ వైరల్ కావడంతో సునీత పై వ్యతిరేకత మొదలైందని కూడా చర్చ జరుగుతోంది. Maganti Sunitha

Also Read: Jubilee Hills Bypoll: బీజేపీలో గులాబీ పార్టీ విలీనం.. రేవంత్ రెడ్డి అదిరిపోయే స్కెచ్?

అటు తన కొడుకు చావుకు కేటీఆర్ కారణం అంటూ మాగంటి గోపీనాథ్ తల్లి వ్యాఖ్యలు చేసిన వీడియో కూడా వైరల్ గా మారింది. అయితే ఇన్ని రోజుల నుంచి రాని కొత్త చర్చ ఇప్పుడే ఎందుకు వస్తోందని గులాబీ పార్టీ కౌంటర్ ఇస్తోంది. గులాబీ పార్టీని ఓడించేందుకు ఇలా కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ పై ఫైర్ అవుతున్నారు. ఇన్ని రోజులు మాగంటి గోపీనాథ్ తల్లి అలాగే కొడుకు ఎక్కడికి వెళ్లారని గులాబీ పార్టీ సోషల్ మీడియా నిలదీస్తోంది. Maganti Sunitha

Also Read: Jubilee Hills Bypoll: కేసీఆర్ సంచ‌ల‌న ప్రెస్ మీట్‌..ఇక కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా…