
Singer Sunitha: సింగర్ సునీత ఈమె గాయకురాలిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించింది. కేవలం గాత్రమే కాకుండా తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇప్పటికే ఐదు పదుల వయస్సు దగ్గరికి వస్తున్నా కానీ 20 ఏళ్ల యువతుల కనిపించడం ఆమె స్పెషాలిటీ. ఆమె నటనా రంగంలో అడుగుపెట్టలేదు కానీ ఒక హీరోయిన్ ఏ విధంగా మెయింటైన్ చేస్తుందో ఆ విధంగా ఆమె లుక్ ఉంటుంది. అలాంటి సింగర్ సునీత తెలుగు ఇండస్ట్రీలో వందలాది పాటలు పాడింది.
The music director wife insulted Singer Sunitha
అలాంటి ఈమె ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఈమె పాటలు పాడడమే కాకుండా పలు పాటల పోటీల వేదికల్లో పాల్గొని జడ్జిగా వ్యవహరిస్తోంది. అలాంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒక పరాభావం గురించి బయట పెట్టింది. ఒక ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ భార్య తనతో అసభ్యంగా ప్రవర్తించిందని చెప్పుకొచ్చింది. ఆమె చేసిన పనికి సునీత రాత్రంతా ఏడ్చానని అన్నది.(Singer Sunitha)
మరి ఆ డైరెక్టర్ ఎవరు ఏంటనేది ఆమె చెప్పలేదు.కానీ వాళ్ల వల్ల తాను చాలా బాధపడిందట.. ఒకసారి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ స్టూడియోకి సునీత ఒక పాట పాడడానికి వెళ్లిందట. అయితే ఆ మ్యూజిక్ డైరెక్టర్ పాట పాడమని మైక్ ఇచ్చారట. ఈ సమయంలో తన భార్య కూడా అక్కడే ఉన్నది.. అయితే నేను పాట పాడి అంతా అయిపోయిన తర్వాత ఆ మ్యూజిక్ డైరెక్టర్ భార్య నాకు వార్నింగ్ ఇచ్చింది.

మా ఆయన చేతులను తాకుతావ్ ఏంటి నువ్వు అసలు ఏమనుకుంటున్నావ్ నీ ఉద్దేశం ఏంటి అంటూ నాతో అసభ్యంగా మాట్లాడింది. వెంటనే నేను ఆమెకు దీటుగా సమాధానం చెప్పానని సునీత చెప్పుకొచ్చింది. కానీ ఆమె మాట్లాడిన విధానం నన్ను చాలా బాధించింది. ఇంటికి వెళ్లి రాత్రంతా వెక్కివెక్కి ఏడ్చానని చెప్పుకొచ్చింది.(Singer Sunitha)




















