
Tamarind Seeds: చింతపండు ప్రతిరోజు ఇంట్లో అనేక రకాల వంటలలో ఉపయోగిస్తూ ఉంటారు. చింతపండు పప్పు, చారు, రసం, పులుసు, పచ్చడి, కూరలలో చాలా రకాల వంటలలో వాడుతూ ఉంటారు. చింతపండు వంటలలో వేయడం వల్ల రుచి పెరుగుతుంది ఇది చాలా రుచిగా పులుపుగా ఉంటుంది. ఆయుర్వేదంలో చింతపండుకు ప్రత్యేకమైన స్థానం కలదు. చింతపండును కొన్ని రకాల ఆయుర్వేద మందులలో వాడుతూ ఉంటారు. అయితే చింతపండు వాడుకొని అందులో ఉండే గింజలను పాడేస్తూ ఉంటారు కానీ ఆయుర్వేద వైద్యంలో చింతగింజలు చాలా రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. Tamarind Seeds
Benefits of Tamarind Seeds
ఇవి ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చింతగింజలను ఆయుర్వేద వైద్య విధానంలో అనేక రకాల ఔషధాలలో షాంపూల తయారీలో వాడుతూ ఉంటారు. చింత గింజలలో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. చింత గింజలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ గింజలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. చింతగింజలు డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. ఆహారం వేగంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యలను తొలగిస్తుంది. శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియాను, వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుంది. చింత గింజలను తీసుకున్నట్లయితే జీర్ణ వ్యవస్థలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. చింత గింజలను తినడం వల్ల పైత్య రసాలు ఉత్పత్తి అవుతాయి దీంతో మనం తీసుకునే ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. చింతగింజలను తినడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. Tamarind Seeds
Also Read: RCB: చిన్నస్వామిలో నో ఐపీఎల్..షాక్ లో బెంగళూరు ఫ్యాన్స్?
చింత గింజలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో వాపులు తగ్గిపోతాయి. చింత గింజలు తినడం వల్ల కీళ్ల సమస్యలు, వాపు సమస్యలు తొలగిపోతాయి. ఈ గింజలను తిన్నట్లయితే కీళ్లలో గుజ్జు పెరుగుతుంది ఇవి దృఢంగా ఆరోగ్యంగా మారుతాయి. కీళ్లనొప్పులు తగ్గుతాయి. చింతగింజలలో కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల నిర్మాణానికి సహాయం చేస్తుంది. విరిగిన ఎముకలు వేగంగా అతుక్కుంటాయి. చింత గింజలు శరీరంలో ఒత్తిడి, ఆందోళన లాంటి సమస్యలను తగ్గిస్తాయి. చింత గింజలకు దంత సమస్యలను కూడా నివారించే శక్తి కలదు. ఇది దంతాలకు ఎంతో మేలు చేస్తాయి. చింతగింజల పొడితో దంతాలను తోమినట్లయితే దంతాలు తెల్లగా శుభ్రంగా మారుతాయి. చింత గింజలు ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలను కలిగిస్తాయి. చింత గింజలను కొద్దిగా వేడి చేసుకొని నమిలినట్లయితే దంతాలు బలంగా మారుతాయి. దీనికి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యం కలదు. Tamarind Seeds
Also Read: KCR: జూబ్లీహిల్స్ లో ఓడిపోతే, KCR ఫ్యామిలీ మొత్తం అరెస్ట్?




















