
Chinna Srisailam Yadav: జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆయన గెలిచిన మూడు రోజులకే జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో రౌడీయిజం పెరిగిపోతోందని గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొడుకు గెలిచిన మూడు రోజులకే శ్రీశైలం యాదవ్ రౌడీయిజం మొదలుపెట్టినట్లు వీడియో బయటకు వచ్చింది. Chinna Srisailam Yadav
Chinna Srisailam Yadav slams padi koushik reddy
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బెదిరిస్తూ రెచ్చిపోయారు శ్రీశైలం యాదవ్. గులాబీ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బట్టలు విప్పి, తోలు తీయిస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు శ్రీశైలం యాదవ్. తాను ఒక్క ఆర్డర్ ఇస్తే వాడి వెనుక ఉన్నవాళ్లే వాడిని తన్ని తరిమేస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీశైలం యాదవ్ ఈ వ్యాఖ్యలు చేయవలసిన వీడియో వైరల్ గా మారింది. Chinna Srisailam Yadav
Also Read: Kavitha: రేవంత్ రెడ్డి -కల్వకుంట్ల కవిత కాంబినేషన్ లో బడా కంపెనీ ?
దీనిపై రాజకీయ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెలుపు తర్వాత అహంకారం పెరిగితే అసలు బాగోదని, అలాంటి వాళ్లకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం 24 వేల పై చిలుకు మెజారిటీతో గ్రాండ్ విక్టరీ కొట్టారు. దీంతో గులాబీ పార్టీ అభ్యర్థి సునీత ఓటమిపాలయ్యారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణం కారణంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక అయింది. Chinna Srisailam Yadav
Also Read: Vangaveeti Ranga: వంగవీటి రంగా కుమార్తె రాజకీయ రంగ ప్రవేశం ?




















