Sai Durga Tej: వచ్చే ఏడాదే నా పెళ్లి.. సడన్ షాకిచ్చిన సాయి దుర్గ తేజ్.. అమ్మాయి ఆమెనేనా..?

Sai Durga Tej: మెగా ఫ్యామిలీలో మరోసారి పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి దుర్గ తేజ్ తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా ఈ గుడ్ న్యూస్ ని

Sai Durga Tej Marraige

Sai Durga Tej: మెగా ఫ్యామిలీలో మరోసారి పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి దుర్గ తేజ్ తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా ఈ గుడ్ న్యూస్ ని అభిమానులతో పంచుకున్నారు.చాలా రోజుల నుండి సాయి దుర్గ తేజ్ పెళ్లి వార్తలు వినిపిస్తున్నప్పటికీ అవేవీ నిజమవ్వలేదు.ఇక రీసెంట్ గా అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అందరి చూపు సాయి దుర్గ తేజ్ మీద పడింది.

Sai Durga Tej Marraige

అలా ఫైనల్ గా సాయి దుర్గ తేజ్ కూడా తాను పెళ్లి చేసుకోబోతున్నానని,అది కూడా వచ్చే ఏడాదే అంటూ తిరుమల దేవస్థానంలో ఈ గుడ్ న్యూస్ ని పంచుకున్నారు.. ఈరోజు ఉదయం తిరుమల వెళ్లిన సాయి దుర్గ తేజ్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ..వచ్చే ఏడాది నేను కచ్చితంగా పెళ్లి చేసుకోబోతున్నాను. (Sai Durga Tej)

Also Read:Mahesh Babu: ఇన్నాళ్లు సంపాదించుకున్న మహేష్ పరువు మొత్తం పాయే.. ఆ హీరోలతో పోలుస్తూ ట్రోల్స్.!

మంచి మంచి సినిమాలు అందించడంతోపాటు నా జీవితాన్ని మంచి బాటలో నడిపిస్తున్న ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను. అంతా ఆ గోవిందుడిదే భారం అంటూ సాయి దుర్గ తేజ్ చెప్పుకొచ్చారు. ఇక సాయి దుర్గ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించడంతో ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరా అంటూ సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు.

Sai Durga Tej Marraige

అయితే సాయి దుర్గ తేజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ప్రకటించకపోయినప్పటికీ సినీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. మెగా ఫ్యామిలీకి దూరపు బంధువైన ఓ అమ్మాయిని ఇచ్చి సాయి దుర్గ తేజ్ కి పెళ్లి చేస్తున్నట్టు సమాచారం.(Sai Durga Tej)