
BRS – TRS: తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పుట్టుకు వచ్చిన కేసీఆర్ పార్టీ, దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా నిలిచింది. దాదాపు 14 సంవత్సరాల పాటు తెలంగాణ కోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చింది గులాబీ పార్టీ. ఈ నేపథ్యంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన గులాబీ పార్టీ, తెలంగాణ రాష్ట్రం వచ్చాక 10 సంవత్సరాల పాటు అధికారంలో కూడా ఉంది. BRS – TRS
BRS – TRS kcr shocking decision over gulabi party
అనేక సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలతో దుమ్ము లేపింది. అయితే ఇప్పుడు అలాంటి గులాబీ పార్టీకి కష్టాలు వచ్చి పడ్డాయి. ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చారు అప్పటినుంచి కెసిఆర్ ఎలాంటి వ్యూహరచనలు చేసినా చిత్తు అయిపోతున్నారు. మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఇలాంటి నేపథ్యంలోనే గులాబీ పార్టీ పేరు మార్చాలని కేసీఆర్ అనుకుంటున్నారట. BRS – TRS
Also Read: Congress: జూబ్లీహిల్స్ విజయం..రంగంలోకి బాబు, కాంగ్రెస్ లోకి మరో 10 మంది ఎమ్మెల్యేలు ?
ఎప్పటిలాగే టీఆర్ఎస్ గా మార్చేందుకు వ్యూహరచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. BRS పేరులోనే దోషం ఉందని ఓ పండితుడు చెప్పాడట. దీంతో టిఆర్ఎస్ గా మార్చేందుకు వ్యూహరచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 10 ఉప ఎన్నికలు జరగబోతున్నట్లు చర్చ జరుగుతోంది. అంతకంటే ముందే టిఆర్ఎస్ గా మార్చాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారట. మరి నిజంగానే పేరు మార్చుతారా? అలాగే ముందుకు వెళ్తారా అనేది చూడాలి. BRS – TRS
Also Read: IND vs SA: టీమిండియా ఓటమికి 5 కారణాలు ఇవే.. మెయిన్ విలన్ గౌతమ్…




















