
Heroine: ఆ హీరోయిన్ అర్ధరాత్రి పార్టీలకు వెళ్తూ కోట్లు సంపాదిస్తుందా.. గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఉన్నది ఎంత నిజం అనేది ఇప్పుడు చూద్దాం. కాయాదు లోహర్.. లవ్ టుడే సినిమాతో టాలీవుడ్ మంచి క్రేజ్ సంపాదించిన ఈ బ్యూటీ ఆ తర్వాత వచ్చిన డ్రాగన్ మూవీతో కూడా హిట్ కొట్టింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గురించి వస్తున్న ఆరోపణలపై స్పందించింది కాయదు లోహర్..
The Heroine who earns crores by going to midnight parties
డ్రాగన్ మూవీ ప్రారంభమైనప్పటి నుండి నేను ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాను. ఇది అంత సులభం కాదు. నేను చాలా కాలంగా దీని గురించి ఆలోచిస్తున్నాను . నేను సినీ బ్యాగ్రౌండ్ నుండి ఇండస్ట్రీ లోకి రాలేదు. ఇది నాకు చాలా కొత్తది. ప్రజలు నా గురించి ఏం మాట్లాడుకున్నా కానీ ఇలాంటిది నన్ను ఇంతగా దెబ్బతిస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు.(Heroine)
Also Read: Ibomma Ravi: “ఆ మాయలాడి వల్లే ఐబొమ్మ రవికి క్రిమినల్ మైండ్”.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు.!
కనీసం నాకు నిద్ర కూడా పట్టడం లేదు.నిద్ర పోయినప్పుడల్లా ప్రజలు నా గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారో అని చాలా కష్టంగా ఉంది అంటూ ఎమోషనల్ అయింది. అయితే కాయాదు లోహర్ ఈ కామెంట్ చేయడం వెనుక కారణం ఏంటంటే.. రీసెంట్ గా తమిళనాడులో జరిగిన టస్కామ్స్ స్కాం కలో కాయాదు లోహర్ కి రిలేషన్ ఉంది అనే వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈడీ దాడిలో కాయాదు లోహర్ పేరు ఉన్నట్టు వార్తలు బయటకు రావడంతో చాలామంది ఈమెపై నెగటివ్ కామెంట్లు చేశారు. కాయాదు లోహర్ రాత్రిపూట ప్రైవేట్ కార్యక్రమాలకు వెళుతూ ఒక ఈవెంట్ కి 35 లక్షలు వసూలు చేసిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ ఆరోపణలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాయాదు లోహర్ స్పందించి ఎమోషనల్ అయింది.(Heroine)




















