
Dhanush manager: ధనుష్ మేనేజర్ శ్రేయస్ అంటే కోలీవుడ్ వారికి సుపరిచితమే.అంతే కాదు ధనుష్ ని దగ్గరుండి చూసిన వారికి శ్రేయస్ సుపరిచితుడే..ధనుష్ తన మేనేజర్ శ్రేయస్ తో మేనేజర్ లా కాకుండా క్లోజ్ ఫ్రెండ్ లా వ్యవహరిస్తాడు. అలా చాలా క్లోజ్ గా శ్రేయస్ తో ఉంటాడు.అయితే అలాంటి శ్రేయస్ పై తాజాగా యువ నటి సంచలన ఆరోపణలు చేసింది.ధనుష్ సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి తనని లైంగికంగా వాడుకోవాలని చూశాడు అంటూ ఆ నటి చేసిన కామెంట్లు ప్రస్తుతం కోలీవుడ్లో దుమారం సృష్టిస్తున్నాయి.
The heroine who exposed the anarchy of Dhanush manager
మరి ఇంతకీ ఆ నటి ఎవరు.. శ్రేయస్ చేసిన పని ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. తాజాగా కోలీవుడ్ టీవీ యాక్ట్రెస్ మాన్య ఆనంద్ ఇండియా టుడే కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనుష్ మేనేజర్ శ్రేయస్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని,ధనుష్ సినిమాలో ఓ పాత్ర ఇస్తాను. కానీ కొన్ని విషయాల్లో రాజీపడి నాకు కమిట్మెంట్ ఇవ్వాలి అంటూ వేధించారని చెప్పుకొచ్చింది. అంతేకాదు ధనుష్ సినిమాలో పాత్ర కోసం ఆమాత్రం రాజీ పడి ధనుష్ సినిమా కోసం త్యాగం చేయలేవా కమిట్మెంట్ ఇవ్వలేవా అని తనని ఇబ్బందులకు గురి చేశాడని మాన్య ఆనంద్ చెప్పుకొచ్చింది.(Dhanush manager)
అంతేకాదు సినిమాలో ఆఫర్ ఇస్తే నీకు కమిట్మెంట్ ఇవ్వాలా అని నేను అరిచేసరికి గొడవ పెద్దదెయ్యలా ఉంది అనుకున్న శ్రేయస్ వెంటనే ధనుష్ ఆఫీస్ అడ్రస్ షేర్ చేసి కొన్ని స్క్రిప్టులు పంపించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అంటూ చెప్పింది. అయితే చాలా రోజులుగా ఈ విషయాన్ని తనలోనే దాచుకున్న మాన్య ఆనంద్ తాజాగా ఇండియా టుడే కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.

దీంతో చాలామంది నెటిజెన్లు ధనుష్ సినిమాలో ఆఫర్ కోసం వచ్చిన నటీమణులందరిని ధనుష్ మేనేజర్ ఇలాగే వేధిస్తున్నాడా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇంత జరుగుతుంటే ధనుష్ కి తెలియడం లేదా..ఎందుకు తన మేనేజర్ ని మందలించడం లేదు అంటూ మండిపడుతున్నారు. అయితే ఇప్పటి వరకైతే ధనుష్ గాని ఆయన మేనేజర్ గాని మాన్య ఆనంద్ చేసిన వ్యాఖ్యలపై స్పందించలేదు. ఒకవేళ ఈ విషయంపై ధనుష్ మేనేజర్ స్పందించాల్సి వస్తే ఏ విధంగా దానికి క్లారిటీ ఇస్తారు అనేది చూడాలి.(Dhanush manager)




















