KTR: కేటీఆర్ కు బిగ్ షాక్…అరెస్ట్ రంగం సిద్ధం ?

KTR
KTR

KTR: బీఆర్‌ఎస్ పార‌టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఈ- ఫార్ములా ఈ రేస్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీంతో కేటీఆర్ పై చార్జెస్ ఫ్రేమ్ చేయనుంది ఏసీబీ. ప్రజా ప్రతినిధి కావటంతో కేటీఆర్ ని ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి పొందింది ఏసీబీ బృందం. KTR

Big shock for KTR, Governors permission for investigation

త్వరలో కేటీఆర్ పై చార్జి షీట్ దాఖలు చేయనున్న ఏసీబీ.. అరెస్ట్ చేసే అంశాల‌పై కూడా ఫోక‌స్ చేయ‌నుంది. గత ఏడాది డిసెంబర్ 19న కేటీఆర్ పై కేసు నమోదు అయిన సంగ‌తి తెలిసిందే. సెప్టెంబర్ 9 న గవర్నర్ కు లేఖ రాసింది ఏసీబీ. ఇక కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని సెప్టెంబర్ 9న లేఖ రాసింది. 70 రోజుల తర్వాత గవర్నర్ నుండి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏసీబీ. గవర్నర్ అనుమతి ఇవ్వడంతో కేటీఆర్ పై అభియోగాలు మోపనుంది ఏసీబీ. KTR

Also Read : Raja Mouli: రంగంలోకి బీజేపీ…డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు ?

జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో గులాబీ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి లో నూతన ఉత్సాహం నెలకొంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి అదే సమయంలో కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారట. ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారట. KTR

Also Read : Vijayasai Reddy: TDP లోకి విజయసాయిరెడ్డి.. చంద్రబాబు సలహాదారుడిగా పాత్ర?