Raj-Koti: ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సాంగ్స్.. కానీ ఆ ఒక్క సంఘటన వల్ల విడిపోయిన రాజ్-కోటి.?

Raj-Koti: సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తింపు ఉంటుంది.అలా ఇండస్ట్రీలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్న రాజ్ కోటి అంటే కూడా తెలియని వారు ఉండరు. ఇందులో రాజ్

Raj-Koti separated because of that one incident

Raj-Koti: సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తింపు ఉంటుంది.అలా ఇండస్ట్రీలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్న రాజ్ కోటి అంటే కూడా తెలియని వారు ఉండరు. ఇందులో రాజ్ మరణించారు.అయితే దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్లుగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న రాజ్ కోటి ఒకప్పుడు దాదాపు రెండు వందల సినిమాలకు కలిసి వర్క్ చేశారు.కానీ ఆ తర్వాత వీరి మధ్య జరిగిన ఓ సంఘటన విడదీసింది. అలా వీరిద్దరూ కలిసి మళ్ళీ ఏ సినిమాలో కూడా చేయలేదు.

Raj-Koti separated because of that one incident

అయితే చక్రవర్తి దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్న సమయంలోనే రాజ్ కోటి మధ్య స్నేహబంధం ఏర్పడి మొదట రాజ్ కి ఓ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు కలిసి వర్క్ చేద్దామని భావించి అప్పటినుండి కలిసి వర్క్ చేశారు. అలా మొదటి సినిమా హిట్ కొట్టడంతో ఆ తర్వాత వరుస సినిమాలు వచ్చాయి. అలా వీరి జోడికి ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు లభించి ఎన్నో హిట్ సినిమాలకు ఈ ఇద్దరిని తీసుకున్నారు. అలా సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలో ఎవరు చిచ్చుపెట్టారో ఈ విషయాన్ని కోటి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ..సినిమాల్లో మాకు వచ్చిన అవకాశాలన్ని ఎంతో బాగా సద్వినియోగం చేసుకున్నాం. (Raj-Koti)

Also Read: Rashmika: తొలిప్రేమ విషయంలో రష్మిక అంత బాధ అనుభవించిందా.. హీరోయిన్ బయట పెట్టిన చేదు నిజాలు.!

కానీ మేము ఓ సినిమా చేస్తున్న సమయంలో రాజ్ కి ఎవరు చెడుగా చెప్పారో దాంతో వెంటనే రాజ్ నా దగ్గరికి వచ్చి ఇక మనం ఇద్దరం విడిపోతాం. ఇప్పటినుండి కలిసి చేయడం కుదరదు అని చెప్పారు.ఆ మాటకు నేను చాలా బాధపడిపోయి ఎవరో మనిద్దరి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు.వాళ్ళని పట్టించుకోకు. మనం కలిసే వర్క్ చేద్దాం అని చెప్పాను.అయినా కూడా రాజ్ వినిపించుకోలేదు. అలా అప్పటినుండి మేము విడివిడిగా సినిమాలు చేశాం. కానీ మేము వర్క్ పరంగా విడిపోయినప్పటికీ స్నేహితులుగా మాత్రం కొనసాగాం.

Raj-Koti separated because of that one incident

ఆ సమయంలో బాలసుబ్రమణ్యం గారు చాలా బాధపడి మళ్లీ మమ్మల్ని కలిపారు. కానీ మేము మళ్ళీ కలిసి వర్క్ చేద్దాం అన్నా కూడా ఎవరు అవకాశాలు ఇవ్వకపోవడంతో మా ఇద్దరి కాంబోలో మళ్లీ మ్యూజిక్ ఆల్బమ్ రాలేదు..అంటూ కోటి చెప్పుకొచ్చారు. ఇక కోటితో విడిపోయాక రాజ్ చేసిన ఏ సినిమా కూడా అంత హిట్ అవ్వలేదు. కానీ కోటి మాత్రం ఎన్నో హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగారు.అలా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది వారి మధ్య గొడవలు సృష్టించడంతో రాజ్ కోటి మధ్య వర్క్ పరంగా విభేదాలు వచ్చాయని ఆ ఇంటర్వ్యూలో కోటి చెప్పుకొచ్చారు.(Raj-Koti)