
Allari Naresh: దివంగత డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ ఎంత పెద్ద దర్శకుడో చెప్పనక్కర్లేదు.ఈయన ఎన్నో హిట్ సినిమాలు తీసి ఇండస్ట్రీలో స్టార్ దర్శకుల లిస్టులో చేరిపోయారు. అయితే అలాంటి ఈవివి సత్యనారాయణ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సూసైడ్ చేసుకొని మరణించాలి అనుకున్నారట. అయితే ఈ విషయం గురించి అల్లరి నరేష్ ఆ మధ్యకాలంలో చెబుతూ ఎమోషనల్ అయ్యారు.అల్లరి నరేష్ తండ్రి సూసైడ్ గురించి ఏం చెప్పారంటే..
Allari Naresh emotional comments on EVV Sathya Narayana
మా నాన్న మొదట దర్శకత్వం వహించిన సినిమా చెవిలో పువ్వు.. ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.కానీ ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో నాన్న ఇక నాకు దర్శకుడిగా ఎవరు అవకాశాలు ఇవ్వరు. నా కెరియర్ అయిపోయింది.ఇల్లు పిల్లల్ని ఎలా సాకేది అని ఒత్తిడికి గురై సూసైడ్ చేసుకోవాలి అనుకున్నారట. అలా రాజమండ్రీ నుండి వచ్చే సమయంలో నదిలో దూకి చనిపోవాలి అని బయటికి వచ్చారట.(Allari Naresh)
Also Read: Allari Naresh: పుట్టెడు దుఃఖం ఉన్నా ఏడుపు ఆపుకొని మరీ కామెడీ చేసిన అల్లరి నరేష్.. ఏం జరిగిందంటే.?
కానీ అప్పటికి మేము గుర్తుకు రావడంతో నాన్న వెనక్కి తగ్గారు. అలా సూసైడ్ చేసుకోవాలి అనుకున్న మా నాన్నని మళ్లీ మామూలు మనిషిని చేసింది రామానాయుడు గారే. రామానాయుడు మా ఇంటికి దేవుడు ఆయన వల్లే మేము ఇలా ఉన్నాం. నాన్నగారికి రామానాయుడు గారు ప్రేమఖైదీ సినిమా ద్వారా అవకాశం ఇచ్చారు.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో నాన్నగారికి వరుస అవకాశాలు వచ్చాయి. అలా ఒకరకంగా మా ఫ్యామిలీని రామానాయుడు గారే నిలబెట్టారు. అందుకే ఇప్పటికీ ఆయన్ని మేము దేవుడిగా కొలుస్తాం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అల్లరి నరేష్. ఇక అల్లరి నరేష్ నటించిన తాజా మూవీ 12 ఏ రైల్వే కాలనీ నవంబర్ 21న విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది.(Allari Naresh)




















