
Onion Juice: ప్రస్తుత కాలంలో మనం తినే ఆహారంపై అందరూ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే అనారోగ్యం బారిన పడే ప్రమాదాలు పొంచి ఉంటాయి. అయితే ఉల్లిపాయ రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా ఉపయోగపడుతుందని స్పష్టం చేస్తున్నారు. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందట. ఈ ఉల్లిపాయ రసం తలకు రాసుకుంటే చుండ్రు సమస్య కూడా తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలడం కూడా ఆగిపోయి, మరింత దృఢంగా జుట్టు పెరుగుతుందట. Onion Juice
Benefits of onion juice
రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉల్లిపాయ చాలా బాగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణ క్రియ పైన ఉల్లిపాయ రసం ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుంది. ఉల్లిపాయ రసం వారంలో రెండు సార్లు అయినా తాగితే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందట. తద్వారా గ్యాస్ అలాగే మలబద్ధకం సమస్యలు కూడా తొలగిపోతాయి. కిడ్నీలో రాళ్లను కూడా కరిగించే బలం ఉల్లిపాయ రసానికి ఉంటుంది. Onion Juice
Also Read: Rohit-Kohli: డిసెంబర్ 6న వైజాగ్‌కు రోహిత్, కోహ్లీ..టికెట్ ధర ఎంతంటే ?
ఎముకల బలానికి ఉల్లిపాయ రసం ఎంతో మేలు చేస్తుంది. కాల్షియం బాగా అందిస్తుందని చెబుతున్నారు వైద్యులు. కంటి ఆరోగ్యానికి కూడా ఉల్లిపాయ ఎంతో ఉపయోగపడుతుందట. కళ్ళు సరిగ్గా కనిపించని వాళ్ళు ఉల్లిపాయ రసం ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. బరువు తగ్గించడంలో కూడా ఉల్లిపాయ రసం ఎంతో సహాయ పడుతుందని వైద్య సూచిస్తున్నారు. ఉల్లిపాయ తినడమే కాకుండా దాని రసాన్ని కూడా ఇక పోయిన తాగితే మంచిది అని చెబుతున్నారు. Onion Juice
Also Read: I-Bomma Ravi Father: కోట్లు ఖర్చుపెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు.. ఐ-బొమ్మ రవి తండ్రి…




















