Nara Rohith: నారా రోహిత్ పేరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. దానికి కారణం ఆయన పెళ్లికి రెడీ అయిపోవడమే. అయితే ఒక హీరో పెళ్లి చేసుకుంటున్నాడు అంటే ఆ హీరోకి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడుతూ ఉంటాయి. అలా తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లికి రెడీ అయిపోయిన నారా రోహిత్ గురించి కూడా అలాంటి రూమర్లే వినిపిస్తున్నాయి.
Nara Rohith loved the heroine sister deeply
అదేంటంటే.. నారా రోహిత్ కి ఇప్పటికే చాలాసార్లు లవ్ ఫెయిల్యూర్ అయిందని, అది కూడా హీరోయిన్స్ తోనే అని ఒక రూమర్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇప్పటికే నారా రోహిత్,రెజినా లవ్ స్టోరీ గురించి కొన్ని వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా మరో హీరోయిన్ తో కూడా నారా రోహిత్ నడిపిన ప్రేమాయణం కి సంబంధించిన వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Nara Rohith)
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పిల్లలకు చిప్ప గతే.. ఆస్తి మొత్తం వారికే..?
ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు స్టార్ హీరోయిన్ గా దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ అంటే అందరికీ తెలుసు. అయితే ఈమె చెల్లెలు నిషా అగర్వాల్ కూడా చాలామందికి తెలుసు. నిషా అగర్వాల్ కొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేసింది. అలా నారా రోహిత్ తో కలిసి సోలో అనే మూవీలో నటించే సమయంలో నిషా అగర్వాల్ కి నారా రోహిత్ కి మధ్య ఏదో నడుస్తోంది అంటూ వార్తలు నెట్టింట్లో జోరుగా వినిపించాయి.
అయితే వీరిద్దరి డేటింగ్ వార్తలు చక్కర్లు కొట్టాక కొద్ది రోజులకే బ్రేకప్ అయినట్టు వార్తలు వినిపించాయి.దానికి కారణం కూడా కాజల్ అనే గాసిప్ వినిపించింది. అయితే నారా రోహిత్ నిషా అగర్వాల్ డేటింగ్ వార్త తెలిసి కాజల్ చెల్లెలిపై కోప్పడి సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే ఇలాంటి వాటికి లొంగిపోకూడదు. ముందుగా నీ కెరియర్ చూసుకో అని వార్నింగ్ ఇచ్చిందట. ఇక అక్క వార్నింగ్ తో నిషా అగర్వాల్ నారా రోహిత్ కి బ్రేకప్ చెప్పిందనే టాక్ వినిపించింది.ఒకవేళ కాజల్ అగర్వాల్ ఇందులో వేలు పెట్టకపోయుంటే నారా రోహిత్ నిషా అగర్వాల్ ల పెళ్లి జరిగేదని నెట్టింట రూమర్లు వినిపిస్తున్నాయి.(Nara Rohith)