Fermented Rice: చద్దన్నం తినడం వల్ల వచ్చే ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరతాయని వైద్య నివేదికలో వెళ్లడైంది. చద్దన్నం భారతీయ వంటకాల్లో చాలా పురాతనమైన, ఆరోగ్యకరమైన ఆహారం. ముఖ్యంగా అన్నంని నీటిలో నానబెట్టి లేదా ఉడికించి దీనిని తయారు చేస్తారు. ఇది చాలా సులభంగా తయారయ్యే ఆహారం. ఉదయాన్నే చద్దన్నం, పెరుగు కలుపుకుని తినడం వల్ల రక్తహీనత సమస్యలు దూరం అవుతాయి. Fermented Rice
Health Benfits With Fermented Rice
శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. దంతాలు, ఎముకలు దృఢంగా తయారవుతాయి. చద్దన్నంలోని ప్రోబయోటిక్స్ కడుపులో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదం చేస్తాయి. ఇవి జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. ఆజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శరీరంలోని రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అనేక రకాల వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతోంది. జొన్న చద్దన్నంలో మధుమేహం, ఊబకాయం నియంత్రణకు చాలా మంచిది. Fermented Rice
Also Read: Chandrababu: కుప్పంలో సీఎం చంద్రబాబుకు ఘోర అవమానం?
బ్రౌన్ రైస్ చద్దన్నంలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. రాగి చద్దన్నం ఆకలిని నియంత్రిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా తయారు చేస్తుంది. అరికెల చద్దన్నం వల్ల మూత్రపిండ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నివారణ జరుగుతుంది. చద్దన్నం తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. చద్దన్నంలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచుతాయి. మచ్చలు, ముడతలు లేకుండా తయారుచేస్తాయి. Fermented Rice