Pista Benefits: పిస్తా పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ b6, కాల్షియం, ఐరన్, ప్రోటీన్ అధిక మొత్తంలో లభిస్తాయి. పిస్తా షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. పిస్తా కలిపిన పాలు తాగినట్లయితే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అనేకం. పిస్తా పప్పు, పాలు కాంబినేషన్ తో తీసుకున్నట్లయితే కండరాలు బలోపేతం అవుతాయి. Pista Benefits
Pista Benefits For Human Life
పిస్తా పప్పు పాలలో మరిగించి తిన్నట్లయితే ఎముకలకు బలం చేకూరుతుంది. ఇందులో కాల్షియం అధికంగా ఉంటుంది. పిస్తా పప్పులను పాలలో మరిగించి తిన్నట్లయితే కాల్షియం ఎముకలకు చక్కగా అందుతుంది. పిస్తాని పాలలో మరిగించి తాగితే కీళ్ల నొప్పులు సైతం దూరం అవుతాయి. కళ్ళ సమస్యలు ఉన్నవారు పిస్తా పప్పును పాలలో మరిగించి తాగాలి. Pista Benefits
Also Read: RCB: ఆర్సిబికి షాక్… ఆ ప్లేయర్లు వద్దంటున్న కర్ణాటక సర్కార్ ?
దీనివల్ల కళ్లకు మేలు కలుగుతుంది. కంటి చూపు మెరుగు పడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు పిస్తా పాలు తాగినట్లయితే మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పాలలో నానబెట్టిన పిస్తా పప్పులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అందువల్ల అనేక రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. దీనివల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. Pista Benefits