Diwali Sweets: దీపావళి వచ్చిందంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు కలుసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పండగ రోజు స్వీట్స్, స్నాక్స్ ప్రతి ఇంట్లో తయారు చేసుకుంటారు. పండగ రోజు పిల్లల నుంచి పెద్దల వరకు స్వీట్స్, స్నాక్స్ తినడానికి చాలా ఇష్టపడతారు. అధిక కేలరీలు, కొవ్వు పదార్థాలు చాలా ఎక్కువగా తీసుకుంటారు. Diwali Sweets

Health Issues With Diwali Sweets

ముఖ్యంగా కొవ్వు పదార్థాలు, క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. హై క్యాలరీ ఆహారంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. మనం తీసుకునే ఆహారంలో చిన్న జాగ్రతలను పాటించినట్లయితే పండగ రోజు ఆహారాన్ని ఎంజాయ్ చేస్తూ తినవచ్చు.
Diwali Sweets

Also Read: Kuppam: కుప్పంలో వైసీపీ పార్టీ కార్యాలయం క్లోజ్?

షీర్ఖండ్, కీర్ వంటి పాలతో చేసిన స్వీట్స్ తీసుకోవడం చాలా మంచిది. చక్కెర స్థానంలో డేట్స్, కిస్ మిస్, పండ్లు, బెల్లం, తేనెను వాడితే చాలా మంచిది. కొబ్బరి లడ్డు, రవ్వ లడ్డుకు బదులు ప్రోటీన్ అధికంగా ఉండే శనగపిండితో తయారు చేసిన వేరుశనగ లడ్డు, మైసూర్ పాక్ ను తయారు చేసుకొని తినాలి. బయట స్వీట్స్ షాప్ లో స్వీట్స్ కొనుగోలు చేయకుండా ఇంట్లోనే తయారు చేసుకుని తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. Diwali Sweets