Srikanth Iyengar: ఏంటి నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఆ బోల్డ్ బ్యూటీ ని పెళ్లి చేసుకోబోతున్నారా..ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు.. వీళ్లు మరో నరేష్ పవిత్రలు కాబోతున్నారా అనేది ఇప్పుడు చూద్దాం.. సినిమా ఇండస్ట్రీలో ఉండే నటినటుల మద్య ఎప్పుడు ప్రేమ పుడుతుందో అర్థం అవ్వడం లేదు. ఎందుకంటే పెళ్లయి పిల్లలున్న చాలామంది ప్రేమలో పడి భార్యాభర్తలను పిల్లల్ని వదిలేసి రెండో పెళ్లిళ్లు చేసుకుంటున్న వారు మూడో పెళ్లి చేసుకుంటున్నారు అనేకం మంది ఉన్నారు. అయితే గత సంవత్సరం ఇండస్ట్రీలో రచ్చ సృష్టించిన పవిత్ర లోకేష్ నరేష్ లు ఎంత పెద్ద సంచలనం సృష్టించారో చెప్పనక్కర్లేదు.
Actor Srikanth Iyengar is going to marry a bold beauty
వీరిద్దరికి అప్పటికే 2 మూడు పెళ్లిళ్లు అయి ఉన్నారు. అయినప్పటికీ 60 ఏళ్ల వయసు దాటినా కూడా ప్రేమలో పడి మళ్లీ సహజీవనం చేస్తున్నారు. అయితే ఇప్పుడు నరేష్,పవిత్ర లోకేష్ బాటలోనే మరో జంట కూడా పయనిస్తున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే.. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అందరికీ తెలుసు. ఈయన ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. జబర్దస్త్ కమెడియన్ ధనుష్ ప్రధాన పాత్రలో చేసిన బుజ్జి ఇలా రా మూవీలో ధనుష్ కి మామగారి పాత్రలో చేశారు. ఈయన డాక్టర్ అయినప్పటికీ సినీ రంగంలో రాణించి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయిపోయారు. (Srikanth Iyengar)
Also Read: AR Rahman: విడాకులు తీసుకోబోతున్న ఏ.ఆర్.రెహమాన్.. కారణం.?
అలాగే బెదురులంక 2012 మూవీలో కూడా స్వామీజీ పాత్రలో నటించారు. అలా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయిపోయిన శ్రీకాంత్ అయ్యంగార్ తాజాగా పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది.అయితే ఈయనకు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యి విడాకులు అయినట్టు సమాచారం.తాజాగా ఇండస్ట్రీలో ఉన్న నటి జ్యోతిని పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ అనుమానం రావడానికి కారణం జ్యోతి శ్రీకాంత్ అయ్యంగార్ కలిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేసి “క్రష్ ఆఫ్ మై లైఫ్” అంటూ రాసుకోచ్చాడు. ఈ ఫోటోలో జ్యోతి శ్రీకాంత్ అయ్యంగార్ కి ముద్దు పెడుతుంది.
అంతేకాకుండా “మీ దేవుళ్ళు మాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారా..?” అంటూ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి పోస్ట్ పెట్టడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. అంతేకాదు త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక శ్రీకాంత్ అయ్యంగార్ చేసుకోబోయే నటి జ్యోతి ఒకప్పుడు వరుస అవకాశాలతో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.ముఖ్యంగా పెళ్ళాం ఊరెళితే సినిమాలో తిలోత్తమ పాత్రతో ఇండస్ట్రీలో ఫేమస్ అయింది. అయితే ఈ జంట పెళ్లి వార్తలు ప్రస్తుతం మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.(Srikanth Iyengar)