Keerthy Suresh love with that hero

Keerthy Suresh: తెలుగు ఇండస్ట్రీలో నటి కీర్తి సురేష్ అంటే తెలియని వారు ఉండరు.. హీరోయిన్ గా పలు చిత్రాలు చేసి ఎంతో గుర్తింపు పొందింది. అలాంటి కీర్తి సురేష్ బాల నటిగానే సినిమా ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. అలాంటి ఈమె గురించి ప్రముఖ జర్నలిస్టు సబితా జోసెఫ్ సంచలన కామెంట్స్ చేశారు. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. కీర్తి సురేష్ రామ్ హీరోగా వచ్చినటువంటి “నేను శైలజ” అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

Keerthy Suresh love with that hero

తెలుగులోకి వచ్చే ముందే ఆమె మలయాళం, తమిళ్ లో చాలా చిత్రాలు చేసింది. అలాంటి ఈమె తమిళ్ లో శివ కార్తికేయన్ సరసన ఎక్కువ చిత్రాల్లో నటించింది. ఇదే తరుణంలో వీరి మధ్య లవ్ పుట్టిందని జర్నలిస్టు సబితా జోసెఫ్ జోష్యం చెప్పారు. కీర్తి సురేష్ శివ కార్తికేయన్ “రేమో” అనే చిత్రం చేశారు. ఈ మూవీ వారికి ఎంతో గుర్తింపు నిచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య లవ్ చిగురించిందని, ఈ విషయం చివరికి కార్తికేయన్ కుటుంబంకి తెలియడంతో తీవ్రంగా వ్యతిరేకించారని ఆమె అన్నది..(Keerthy Suresh)

Also Read: Sobhita: “ఒళ్ళు దగ్గర పెట్టుకో” శోభితకి వార్నింగ్ ఇస్తున్న నెటిజెన్స్.. కారణం.?

దీంతో కార్తికేయన్ కుటుంబం ఆయనను హెచ్చరించడంతో ఆయన కీర్తి సురేష్ కు దూరంగా ఉంటూ వచ్చారట. కెరియర్ ఇప్పుడే సెట్ అవుతుంది, ఇప్పుడే ఇలాంటి లవ్ స్టోరీలు బయటకు వస్తే నీ కెరియర్ పాడవుతుందని కుటుంబ సభ్యులు అన్నారట. దీనిపై ఆలోచన చేసిన శివ కార్తికేయన్ కీర్తి సురేష్ తో ఉన్న బంధాన్ని తెంచేసుకున్నారు.

Keerthy Suresh love with that hero

అంతే కాదు రేమో తర్వాత ఇద్దరు కలిసి ఏ చిత్రంలో కూడా నటించలేదని సబితా జోసెఫ్ తెలియజేసింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింటా విపరీతంగా వైరల్ అవుతుంది. దీంతో కీర్తి సురేష్ విషయంలో ఆయన ఎంతో జాగ్రత్తగా వ్యవహరించినా కానీ ఇమాన్ భార్య విషయంలో మాత్రం తప్పు చేశారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో చెప్పండి.(Keerthy Suresh)