Is he the hero who bluntly asked Kushboo if there is a chance

Kushboo: సినిమా ఇండస్ట్రీలో లేడీ నటీనటులపై వేధింపులు అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి.. ఈ వేధింపులకు బలైన వారు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది వాటికి ఎదురు తిరిగి ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు కొంతమంది లొంగిపోయి, కెరియర్ ను కొనసాగించ గలిగారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉండేటువంటి చాలామంది సీనియర్ హీరోయిన్లు ఇతర నటీనటులు, మీటూ ఉద్యమం స్ఫూర్తితో వారికి జరిగినటువంటి అన్యాయాలపై పెదవి విప్పుతున్నారు.

Is he the hero who bluntly asked Kushboo if there is a chance

తాజాగా జస్టిస్ హేమా కమిటీ నివేదిక బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే.. ఆ కమిటీ ద్వారా ఎంతో మంది వారు లైఫ్ లో ఎదుర్కొన్న విషయాలను, ఎవరెవరు వేధింపులకు గురిచేశారో వారి పేర్లను కూడా బయటపెట్టారు. అలాంటి ఈ తరుణంలో తాజాగా 2024 ఈపీ ఉత్సవాల్లో భాగంగా సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఇండస్ట్రీలో మహిళల భద్రతపై ఆమె బహిరంగంగానే మాట్లాడింది..(Kushboo)

Also Read: Aishwarya Rajesh: ఏంటి ఆ హీరోయిన్ కి పెళ్లయ్యిందా.. తాళిబొట్టు పాపిట్లో బొట్టుతో..?

ఈ సందర్భంగా ఆమె ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఎదుర్కొన్న కొన్ని విషయాల గురించి పంచుకుంది. తన కెరియర్ మొదట్లో ఒక సినిమా షూటింగ్ జరుగుతుందట. అయితే చిత్ర యూనిట్ కి దూరంగా ఒక సీన్ షూట్ చేస్తున్నారట. ఈ టైం లోనే ఒక హీరో నన్ను ఏదైనా అవకాశం ఉందా అని అడిగాడని, ఆ టైంలో ఆయన ఏమంటున్నారో నాకు అర్థం కాలేదని, మరోసారి మరో రకంగా చూస్తూ అవకాశం ఉందా అని అడిగారని, వెంటనే విషయాన్ని అర్థం చేసుకున్న నేను ” నా చెప్పు సైజు 41, దాంతో మిమ్మల్ని ఇక్కడే కొట్టాలా లేదంటే చిత్ర యూనిట్ ముందు కొట్టాలా అని అడిగానని తెలియజేసింది.

Is he the hero who bluntly asked Kushboo if there is a chance

ఇక ఆ తర్వాత ఆ హీరో నాతో మాట్లాడడానికి కూడా చాలా భయపడిపోయాడని తెలియజేసింది. ఇండస్ట్రీలో ఎవరికి భయపడకూడదని, భయపడితే చులకన చేస్తారని , ఏదైనా అన్యాయం జరిగినట్టు అనిపిస్తే అక్కడే సమాధానం చెప్పాలని, లైట్ తీసుకుంటే మీ జీవితం కూడా లైట్ అయిపోతుంది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో కొంతమంది నేటిజన్స్ ఆమెకు సపోర్టుగా నిలుస్తూ కామెంట్లు పెడుతున్నారు.(Kushboo)