Bhagya Shri Borse is infatuated with the star hero

Bhagya Shri Borse: రామ్ పోతినేని తెలుగు సినిమా ఇండస్ట్రీలోని యంగ్ హీరోలలో ఈయన కూడా ఒకరు.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హిట్స్, ప్లాప్స్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న హీరో.. అలాంటి రామ్ పోతినేని ప్రస్తుతం యువకులకు రోల్ మోడల్ అని చెప్పవచ్చు. ఆయన ఏ సినిమా ద్వారా వచ్చిన ఒక కొత్త లుక్ ని పరిచయం చేస్తుంటారు.. అలాంటి రామ్ పోతినేని ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ, పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు.

Bhagya Shri Borse is infatuated with the star hero

ఆయన తోటి హీరోలందరికీ పెళ్లిళ్లు అయిపోయి పిల్లలు పుడుతున్నారు. అయినా రామ్ పోతినేని మాత్రం పెళ్లిపై ఎలాంటి విషయాలు బయట పెట్టడం లేదు. ఇదే తరుణంలో ఆయన పెళ్లి వార్తల గురించి సోషల్ మీడియాలో రోజుకు ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఇందులో ఏ వార్త నిజమవ్వలేదు. ఆ హీరోయిన్ తో ఆయన ప్రేమలో ఉన్నారని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని ఇలా ఒక్కో వార్త ఒక్కో విధంగా నెట్టింట చక్కర్లు కొడుతోంది.. అలాంటి ఈ తరుణంలో ఒక యంగ్ హీరోయిన్ రామ్ పోతినేని పై మనసు పడిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే భాగ్యశ్రీ బోర్సే.. (Bhagya Shri Borse)

Also Read: Keerthy Suresh:ఆ హీరోతో కీర్తి సురేష్ లవ్.. పెళ్లి చేసుకోబోయే వేళ కీర్తి సురేష్ సీక్రెట్స్ బట్టబయలు..?

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసుకుంటూ మంచి గుర్తింపు సాధించింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా రవితేజ హీరోగా వచ్చినటువంటి మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ గా చేసి తన అందాల ఆరబోతతో కుర్ర కారుకు మతి పోగొట్టింది. ఈ మూవీ తర్వాత ఈమె రామ్ పోతినేనితో కలిసి మరో సినిమాకు ఓకే చేసినట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో పి మహేష్ డైరెక్షన్ చేస్తున్నారు. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ గా #RAPO 22 అని నామకరణం చేశారు.

Bhagya Shri Borse is infatuated with the star hero

ఈ చిత్రానికి సంబంధించి హీరోయిన్ మీద తీసినటువంటి ఫస్టు షాట్ గోపీచంద్ మలినేని కెమెరా ఆన్ చేయగా, దర్శకుడు హనూ రాఘవపూడి క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ ఫోటో నెట్టింటా చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలో భాగ్యశ్రీ బోర్సే చాలా రొమాంటిక్ గా, ఇద్దరి లుకింగ్స్ చూడముచ్చటగా కనిపించడంతో ఇద్దరికీ బాగా సెట్ అయిందంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు భాగ్యశ్రీ బోర్సే రామ్ ని అలా రొమాంటిక్ గా చూసిన ఫోటో బయటపడడంతో హీరోయిన్ హీరో పై మనసు పడిందని , వీరిద్దరు పెళ్లి పెళ్లి చేసుకుంటే బాగుంటుందంటూ ఎవరికి నచ్చిన విధంగా వారు కామెంట్లు చేస్తున్నారు.(Bhagya Shri Borse)