కుమార్ స్వామి నుండి గతంలో మంచి చిత్రాలు వచ్చాయి . ఈ ఏడాది చివరి లో ఇప్పుడు సినిమా పిచ్చోడు సినిమా తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. స్వీయ దర్శకత్వం లో కుమార్ స్వామి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి . టీజర్, ట్రైలర్ మంచి ఆసక్తిని అయితే కలిగించనది అని చెప్పవచ్చు . మరి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? అనే ప్రశ్నకి సమాధానం ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :

సినిమా కథ : జోష్ అలియాస్ కుమారస్వామి (హీరో ) గ్రామంలో పాల వ్యాపారి గా మరియు అందరిని పేరు తో కాకుండా సినిమాల పేర్లతో పిలవటం అలవాటు చేసుకున్నాడు. గ్రామంలో సినిమా జ్ఞానం లేని వాళ్ళు అని తిట్టడం… ఇలాంటి టైంలో జోష్ వాళ్ళ గ్రామంలో డెమో తీయడానికి వస్తుంది భాను (సావిత్రి కృష్ణ) హీరోయిన్ ఆమెకి కాలేజ్ చైర్మన్ డెమో ఫిలిం తీయడానికి తనకి అవకాశం కల్పిస్తాడు తను తన టీం తో గ్రామానికి వస్తారు. అనుకోకుండానే హీరో కి అవకాశం రావటం ఎలా వచ్చింది ఎలా చేశాడు తన కోరిక ఎలా నెరేవేర్చుకున్నాడు అనేది మిగతా కథ ? దాని కోసం హీరో ఏం చేశాడు. తన కోరిక కోసం (భాను డైరెక్టర్ కి ) అతనికి ప్రేమ లో పడిన విధానం తాను చేసిన సాయం ఏంటి? జోష్ గతమేంటి? అనేది మిగిలిన కథ.

సినిమా విశ్లేషణ: ‘సినిమా పిచ్చోడు ‘ చాలా సాదా సీదాగా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా వచ్చే కామెడీ కూడా సో సో గానే అనిపిస్తుంది. విలన్ సర్పంచ్ వరుసకు మామా కి హీరో వార్నింగ్ ఇచ్చే ఎపిసోడ్ అంతా రొటీన్ గానే అనిపిస్తుంది. సర్పంచ్ సినిమా షూటింగ్ అడ్డుకున్నా కానీ కానీ హీరో జోష్ (హీరో) హీరోయిన్ సావిత్రి కృష్ణ ఇద్దరు కలిసి ఏ విధంగా పూర్తి చేశారూ అన్నది మిగతా కథ ఇలాంటి కథ కుమారస్వామి ఎలా ఎంపిక చేసుకున్నాడు అనేది ఒక గట్ ఫీల్ అని చెప్పుకోవాలి.

తక్కువ బడ్జెట్లో మంచి సినిమా తీయవచ్చు అని నిరూపించాడు కుమార స్వామి ఇంటర్వెల్ బ్లాక్ కూడా మంచి బ్రేక్ ఇచ్చారు .. మరీ ఎక్సయిట్ చేసే లా ఉంటుంది.. కానీ సెకండ్ హాఫ్ కూడా స్టార్టింగ్ పోర్షన్ వీక్ గానే అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత వచ్చే సీన్స్ కట్టి పడేస్తాయి. కథనం కూడా వేగం పుంజుకుంటుంది. అందరూ అటెన్షన్ తో కూర్చుంటారు. సెకండాఫ్ ఊహించని విధంగా ఉంటాయి. కథ సిటీకి వచ్చాక అతనికి ఎదురైన ఇబ్బందులు ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ నిలబడగలిగాడు. అనేది సెకండ్ హాఫ్ కథ .. తన కోరికను హీరో అవ్వాలని కోరికను ఎలా నిరూపించుకున్నాడు సినిమా పిచ్చోడిగా ఎలా ముద్ర నుంచి బయటపడి సినిమా హీరోగా నిలబడగలడనేది రెండో భాగం కథ మొత్తానికి ఈ సినిమా చాలా ప్లాన్ గా చిత్రీకరించారు.
మళ్ళీ క్లైమాక్స్ సాగదీసినట్టు ఉన్నా.. ఓకే అని కన్విన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కుమార స్వామి ఎప్పటిలానే హుషారుగా నటించాడు. సావిత్రి కృష్ణ పాత్ర ఆకట్టుకుంటుంది. డైరెక్షన్ పాత్రలో. ఇమిడి పోయింది .. మిగతా పాత్రలందరూ వారి వారి పరిధి మేరకు అద్భుతంగా నటించారు వారి నటన కొత్తగా అనిపిస్తాయి. భరత్ , జ్యోతి చౌదరి, జోషిత్ ఎన్నేటి, కిట్టయ్య తదితరులు నటించారు.

ప్లస్ పాయింట్స్ :
సెకండాఫ్
ట్విస్టులు
సెంటిమెంట్
కొత్త పాయింట్
సాంగ్స్ మరియు డెమో పోరాఫోలివ్ షూట్
రి రికార్డింగ్

మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
అక్కడక్కడ కొంచెం స్లో నెరేషన్

మొత్తంగా ‘సినిమా పిచ్చోడు ‘.. ఫస్ట్ హాఫ్ కి కొంచెం నిరాశ గా ఉన్న సెకండాఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తారు.. సినిమా పిచ్చి ఉన్న ప్రతి వాడు చూడాల్సిన చిత్రం

రేటింగ్ : 2.5/5