Niharika: మెగా డాటర్ నిహారిక రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను అంటూ ఆ మధ్యకాలంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.అయితే రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా ఓ కారణం ఉందట. మరి ఇంతకీ నిహారిక మొదటి పెళ్లి విఫలమయ్యాక రెండో పెళ్లి చేసుకుంటాను అని అంత కాన్ఫిడెన్స్ గా ఎందుకు చెప్పింది అనేది చూద్దాం. చాలామంది నటీనటులు పెళ్ళయ్యాక వారితో కలిసి జీవించలేకపోతే తొందరగానే విడిపోతారు.ఇక సామాన్య జనాలు ఉన్నంతగా సర్దుకొని జీవించలేరు సెలబ్రిటీలు.
Niharika second marraige
ఎందుకంటే వాళ్ళు లగ్జరీ లైఫ్ కు అలవాటు పడ్డారు.కాబట్టి చిన్న చిన్న గొడవలకే విడిపోతూ ఉంటారు. అలా ఎన్నో కోట్లు పెట్టి పెళ్లి చేసుకున్న మెగా డాటర్ నిహారిక పెళ్లైన రెండు సంవత్సరాలకే భర్తతో విడిపోయింది. ఇక విడిపోయాక నిహారిక రెండో పెళ్లి చేసుకోదని, ఆమెకు పెళ్ళంటేనే విరక్తి పుట్టిందని ఎన్నో రూమర్స్ నిహారిక పై వినిపించాయి.(Niharika )
Also Read: Pawan Kalyan: సినీ, రాజకీయాల్లో తోపైనా పవన్ కి ఆ మహిళను చూస్తే అంత భయమా.?
కానీ ఈ రూమర్స్ అన్నింటికి చెక్ పెట్టేలా నిహారిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు పెళ్లి పై నమ్మకం ఉంది. అంతే కాదు నేను రెండో పెళ్లి కూడా చేసుకుంటాను. ఎందుకంటే నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. పిల్లల కోసమైనా రెండో పెళ్లి చేసుకోవాల్సిందే. ఒకరితో పెళ్లి లైఫ్ విఫలమైతే మళ్లీ పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదని కాదు.
ఇద్దరి మధ్య బంధం చెడిందంటే ఎన్నో కారణాలు ఉంటాయి. నేను రెండో పెళ్లి చేసుకుంటాను.కానీ ఇప్పుడైతే కాదు. ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం సినిమాల పైనే ఉంది. కొద్ది రోజులకు రెండో పెళ్లి పై నిర్ణయం తీసుకుంటాను .అది లవ్ అయినా అరేంజ్డ్ అయినా ఇంట్లో వాళ్లకి ఇష్టమైతేనే చేసుకుంటాను అంటూ నిహారిక చెప్పుకొచ్చింది.(Niharika )