Sri Rapaka: శ్రీ రాపాక అంటే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు.. ఈమె ఏపీకి చెందిన అమ్మాయి. అలా సినిమాల మీద ఇంట్రెస్ట్ తో మోడలింగ్ రంగంలోకి వచ్చి ఆర్జీవి దర్శకత్వంలో వచ్చిన నగ్నం మూవీతో ఇండస్ట్రీలో స్టార్ గా పేరు తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమాలేవి ఈమెకు ఆశించినంత పేరు తెచ్చి పెట్టలేదు.కానీ బిగ్ బాస్ లోకి వెళ్లి కాస్త గుర్తింపు సంపాదించింది.ఇక శ్రీరాపాక సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలతోనే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
Sri Rapaka sensational comments on Puri jagannadh
అయితే అలాంటి శ్రీ రాపాక తాజాగా పూరి జగన్నాథ్ పై మహేష్ బాబు మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక శ్రీరాపాక ఏం మాట్లాడిందంటే.. నేను కాలేజీకి వెళ్లే టైంలో ఆ దారిలో పూరి జగన్నాథ్ గారి ఆఫీస్ ఉండేది. అలా ఆయన ఆఫీస్ కి నేను రోజు వెళ్లే దాన్ని.ఇక అలా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంటే సినిమాల్లో కూడా వెళ్లాలనుకున్నాను. ఇక ఓ రోజు నేను వెళ్లే టైం కి నేల మీద పడుకొని ఉన్నారు. (Sri Rapaka)
Also Read: Jani Master: బయటపడ్డ జానీ మాస్టర్ భార్య బాగోతం.. జానీ బెడ్రూం కి అంత మంది అమ్మాయిల్ని పంపిందా..?
ఆయన్ని చూసి నేను షాక్ అయ్యాను. ఇంత పెద్ద డైరెక్టర్ ఇలా నేల మీద పడుకోవడం ఏంటి అని అనుకున్నాను.ఆ తర్వాత పూరి జగన్నాథ్ నన్ను దగ్గరికి పిలిచి ఆయన కాళ్ల మీద ఎక్కి తొక్కమని చెప్పారు. దాంతో నేను అదే పని చేశాను. అలా మా ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది.అలా అని మీరు అనుకుంటున్నట్లు చెడు రిలేషన్ అయితే కాదు.
ఇక నాకు ఏమి అవసరం వచ్చినా కూడా పూరి జగన్నాథ్ ఆయన్ని అడగమని చెప్పవారు. అలాగే నేను పూరి జగన్నాథ్ ఆఫీసులో ఉన్న సమయంలో అక్కడికి పోకిరి సినిమా సమయంలో ప్రకాష్ రాజ్,మహేష్ బాబులు కూడా రావడం నేను చూశాను. అలా మహేష్ బాబుని చూసినప్పుడు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను.ఆ టైంలో మహేష్ బాబు నన్ను చూసి ఈ పిల్ల బచ్చా ఎవరు అని ఫన్నీగా అడిగేవారు అంటూ శ్రీ రాపాక చెప్పుకొచ్చింది.(Sri Rapaka)