Heroine: కొంతమంది సెలబ్రిటీలు ఎందుకు పెళ్లి చేసుకుంటారో ఎందుకు విడిపోతారు అస్సలు అర్థం కాదు.అసలు విడిపోవడానికి ఎలాంటి రీజన్ లేకపోయినా కూడా చిన్న చిన్న ఇష్యూలకు విడిపోవడం మనం ఈ మధ్యకాలంలో ఎన్నో చూస్తూ ఉన్నాం. అయితే చాలా సంవత్సరాలు కాపురాలు చేసిన జంటలు కూడా విడిపోతున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఓ హీరోయిన్ పెళ్లి వయసు వచ్చిన కూతుర్ని పెట్టుకొని నాలుగో పెళ్లికి సిద్ధమైంది.దీంతో ఈమె పెళ్లి విషయం తెలిసిన చాలా మంది జనాలు తిట్టుకుంటున్నారు.
Heroine who are ready for 4th marriage
ఇక ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి వనిత విజయ్ కుమార్.. ఇక ఆ హీరోయిన్ ఎవరో ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది.. వనిత విజయ్ కుమార్ ప్రముఖ సీనియర్ నటుడు విజయ్ కుమార్ మొదటి కూతురు.. అయితే అలాంటి వనిత విజయ్ కుమార్ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తూ పెళ్లికి సంబంధించిన డేట్ ని కూడా అఫీషియల్ గా బయట పెట్టేసింది.కొరియోగ్రాఫర్ రాబర్ట్ తో కొద్దిరోజులుగా సహజీవనం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా పెళ్లికి రెడీ అయిపోయింది. (Heroine)
Also Read: Chiranjeevi: హీరోయిన్ పరువు తీసేసిన చిరంజీవి.. కక్ష పెంచుకొని ఏం చేసిందంటే..?
అక్టోబర్ 5న వనిత విజయ్ కుమార్ రాబర్ట్ ల పెళ్లి జరగబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. అయితే ఇప్పటికే ఆకాష్, ఆనంద్ జయ దర్శన్ లను పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కంన్నది.అలాగే ఫోటోగ్రాఫర్ పీటర్ పాల్ ని కూడా మూడో పెళ్లి చేసుకున్నట్టు ఆ మధ్య వార్తలు వినిపించాయి. కానీ వీరి మధ్య బంధం చెడిపోయాక నేను పెళ్లి చేసుకోలేదు మేమిద్దరం ఎంగేజ్మెంట్ మాత్రమే చేసుకున్నాము అని చెప్పింది.
అయితే తాజాగా కొరియోగ్రాఫర్ రాబర్ట్ ని నాలుగో పెళ్లి చేసుకోబోతున్నట్టు నటి వనిత విజయ్ కుమార్ బయట పెట్టడంతో చాలామంది నెటిజన్స్ షాక్ అవుతున్నారు.అంతేకాదు నీ కూతురే పెళ్ళీడుకు వచ్చింది.అంత పెద్ద కూతుర్ని పెట్టుకొని ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా.. ఈయనతోనైనా కలిసి ఉంటావా లేక మళ్ళి ఐదో పెళ్లి అంటావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక వనిత విజయ్ కుమార్ కూతురు జోబిక ప్రస్తుతం ట్రై చేస్తోంది.(Heroine)