Pushpa-2: అల్లు అర్జున్ అరెస్ట్.. పుష్ప-2 నిలిపివేయాల్సిందే.?
Pushpa-2: ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా బాక్సాఫీస్ ని చెడుగుడు ఆడుకుంది.. మొదటి రోజే దాదాపు 250, 300 కోట్ల వరకు వసూళ్లు కలెక్ట్ చేస్తుంది అని ఇప్పటికే సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కి బిగ్ షాక్ తగిలింది.అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలని,లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా అందరం ఏకమై పుష్ప-2 సినిమాని నిలిపివేస్తాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
Allu Arjun arrested Pushpa-2 should be stopped
మరి ఇంతకీ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలి అని చెప్పింది ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. అల్లు అర్జున్ పుష్ప టు సినిమా విడుదలైన నేపథ్యంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కీసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే.అంతేకాకుండా ఆమె కొడుకు పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే పిడిఎస్సీ అనే విద్యార్థి సంఘం పుష్ప టు సినిమాపై సంచలన కామెంట్స్ చేసింది. (Pushpa-2)
Also Read: Allu Arjun: వివాదంలో ఇరుక్కున్న అల్లు అర్జున్.. పాపం ఇలా దొరికిపోయాడేంటి.?
సంధ్య థియేటర్లో జరిగిన తొక్కీసలాటకి అల్లు అర్జునే కారణమని, అల్లు అర్జున్ బాధ్యత రహితంగా ఉండడం వల్లే ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది అని, దీనికి కారణం అల్లు అర్జున్ అంటూ పిడిఎస్సి విద్యార్థి సంఘం ఆరోపించింది.అంతేకాదు అల్లు అర్జున్ ని అరెస్టు చేయకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు అన్ని ఏకమై పుష్ప-3 సినిమాను నిలిపివేస్తాం అంటూ మాట్లాడారు.
సినిమా వినోదాన్ని పంచాలి కాని విషాదాన్ని మిగిల్చకూడదు. ఇప్పుడు పుష్ప -2 చేసింది అదే అంటూ సినిమాపై, అల్లు అర్జున్ పై మండిపడ్డారు. మరి పిడిఎస్సి విద్యార్థి సంఘం డిమాండ్ ప్రకారం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.(Pushpa-2)
Allu Arjun (@alluarjunonline) • Instagram photos and videos