Nissan Magnite Car: Rs: 87 thousand price reduced car

Nissan Magnite Car: ప్రస్తుతం మార్కెట్ లో నిస్సాన్ కంపెనీ నుంచి అనేక ఎస్ యువీలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా నిస్సాన్ మాగ్నైట్ కారుపై సరికొత్త ఆఫర్ అందిస్తోంది. ఏకంగా ఈ కారుపై 87 వేల రూపాయల ధర తగ్గింపు చేస్తుంది. అయితే ఈ ఆఫర్ జనవరి 31, 2024 వరకు మాత్రమే ఉంటుందట. కారు కొనాలనుకునే వారు వెంటనే కొనుగోలు చేయండి. మరి ఈ ఎస్ యువి గురించి కొన్ని వివరాలు చూద్దాం..

₹87 Thousand Price Reduced Nissan Magnite Car

నిస్సాన్ మాగ్నైట్ ఎస్ యువి మీరు కొనుగోలు చేసినప్పుడు కార్పొరేట్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజి బోనస్ ఫైనాన్స్ ఆఫర్లలో తగ్గింపు లభిస్తుందట. ఈ కారును లోనుపై కొనుగోలు చేస్తే కంపెనీ మీకు చాలా తక్కువ ఇంట్రెస్ట్ తో అందిస్తోందట. రూ:87 వేల ఆఫర్ లభించడమే కాకుండా గోల్డ్ సర్వీస్ ప్యాక్ కూడా ఈ కారుపై రూ:28 వేల వరకు లభిస్తుందట. (Nissan Magnite Car)

Also Read: Top New Bikes: 1 లక్షలు ఇండియాలో ఉన్న టాప్ బైక్స్ …ధర, ఫీచర్లు ఇవే

ముఖ్యంగా దీన్ని ఫైనాన్స్ లో కొనుగోలు చేసే టైంలో కస్టమర్ కు కనీస వడ్డీ రేటు 6.69%చెల్లించవలసి ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం 2023, 24 మేక్ మాగ్నైట్ మోడల్స్ కు మాత్రమే వర్తిస్తుంది. నిస్సాన్ మాగ్నైట్ ధర రూ: ఆరు లక్షల వరకు మొదలై 11 లక్షల ( ఎక్స్ షోరూం )వరకు ఉన్నది. అలాగే ఈ మాగ్నెట్ 336 లీటర్ల బూట్ స్పేస్, డ్యూయల్ టోన్ కలర్, మొనోటోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.

Nissan Magnite Car: Rs: 87 thousand price reduced car

అలాగే ఈ కారు 5 సీటర్ suv, ఇది 1.0 l నేచురల్లీ యాస్పిరేటెడ్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ తో కూడిన 2 పెట్రోలు ఇంజన్ల ఆప్షన్ కూడా ఉన్నది. అలాగే 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆపిల్ కార్ ప్లేతో కూడిన ఏడు అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కస్టర్ ను కలిగి ఉంది. అలాగే వైర్లెస్ ఫోన్ చార్జర్ ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక భద్రత విషయానికి వస్తే డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ప్రయాణికుల భద్రతను నిర్ధారిస్తాయి.

Join WhatsApp