Air taxi : ఇండియాలో ఎయిర్ టాక్సీ సేవలు ప్రారంభించబోతున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో చెప్పింది. ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లొబ్ ఎంటర్ప్రైజెస్ అమెరికాకి చెందిన ఆర్చర్ తో సంయుక్తంగా వీటిని రూపొందించినట్లు తెలుస్తోంది 2026 నాటికి ఈ ఎయిర్ టాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకు రానున్నారు. ఇక ఈ ఎయిర్ టాక్స్ల కి సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం.. ఢిల్లీలోని కర్ణాటక ప్లేస్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో గురుగ్రామ్ కేవలం 7 నిమిషాల్లోనే చేరుకోవచ్చని ఇండిగో చెప్పింది ఈ ప్రయాణానికి 2000 నుండి 3000 రూపాయలు ఖర్చు అవుతాయని తెలుస్తోంది.

Air taxi will be soon in Delhi

అంతే దూరం కారులో వెళ్లడానికి 90 నిమిషాల సమయం పడుతుంది. అదే ఎయిర్ టాక్సీ లో వెళ్తే కేవలం ఏడే నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ ఎయిర్ టాక్సీలు లో మొత్తం ఆరు బ్యాటరీలు ఉంటాయి. 30 నుండి 40 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అయిపోతాయి. ఢిల్లీతో పాటుగా ముంబై బెంగళూరులో కూడా టాక్సీ లని ప్రారంభించాలని ఇంటర్ గ్లోబ్ అలానే ఆర్చర్ ఏవియేషన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రోజు రోజుకి టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందుతోంది.

Also read: Pavan Kalyan: కత్తి ఇస్తా.. తప్పు చేస్తే నా తల నరికేయండి…!

ఎన్నో మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీకి సంబంధించి అనేక మార్పులు కూడా మనం చూస్తున్నాము. అయితే నిజానికి ఈ ఎయిర్ టాక్సీ అనేది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు ఢిల్లీకి ఎయిర్ టాక్సీ రావడంతో టైమ్ సేవ్ అవుతుంది పైగా 30 కిలోమీటర్ల ని ఏడే నిమిషాల్లో చేరుకోవడం గొప్ప విషయం కదా..? ఇటువంటి కొత్త వాటిని తీసుకు వస్తేనే అభివృద్ధిపథంలో ముందుకు వెళ్ళగలం టాక్సీ సేవలు వలన చాలామందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఇది ఢిల్లీలోనే కాకుండా బెంగళూరు ముంబై వంటి చోట్ల కూడా త్వరలోనే రానున్నట్లు ఇంటర్ గ్లోబ్ ఇంకా ఆర్చర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది (Air taxi).

Join WhatsApp