Bajaj CNG Bike with 100 km mileage

Bajaj CNG Bike: ప్రస్తుత కాలంలో ఎలక్ట్రానిక్ వాహనాలకు విపరీతమైనటువంటి డిమాండ్ పెరుగుతుంది. ఈ తరుణంలోనే ఎన్నో ఎలక్ట్రానిక్ వాహనాలు ఇండియన్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఎలక్ట్రానిక్ సంబంధించినటు వంటి కార్లు మరియు స్కూటర్లను మాత్రమే మనం చూస్తూ వచ్చాం. కానీ బజాజ్ కంపెనీ మరొక ముందడుగు వేసి బజాజ్ సిఎన్జి పేరుతో ఒక బైక్ ను తయారుచేసింది.

Bajaj CNG Bike with 100 km mileage

ప్రస్తుతం ఈ బైకు జూన్ 2024 లో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. దీని యొక్క ఫీచర్స్ ఇతర వివరాలు చూసేద్దామా.. ఇప్పటివరకు దేశంలో సిఎన్జి విభాగంలో ఒక్క బైక్ కూడా మార్కెట్లోకి రాలేదు. తొలిసారిగా బజాజ్ ఆటో ఇండియా ఈ బైక్ గురించి తెలియజేసింది. ఇప్పటికే ఈ బైకు సంబంధించినటువంటి ట్రయల్ రన్ కూడా ప్రారంభించింది అంట. (Bajaj CNG Bike)

Also Read: MG Cyberster: తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు.. 3 సెకండ్లలోనే 100 కి.మీ.ల వేగం..

“బ్రుజర్” పేరుతో ఈ బైక్ ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బైకు లాంచ్, ఇతర వివరాలను బజాజ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ తెలియజేశారు. బజాజ్ సిఎన్జి బైక్ జూన్ లో విడుదల అవ్వనుందని ఆయన తెలియజేశారు. ఈ యొక్క బజాజ్ సిఎన్జి బైక్ కిలోకి 100 కిలోమీటర్ల మైలేజ్ అందజేస్తుంది.

Bajaj CNG Bike with 100 km mileage

ఈ బైకును 100సిసి నుండి 160cc సెగ్మెంట్ లో విడుదల చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా బజాజ్ సిఎన్జి బైక్ ప్రీమియం ధరలో విడుదల కావచ్చు. ఇందులో ఎల్ఈడి లైట్లు, అద్భుతమైన సస్పెన్షన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కస్టర్, అలాగే డిస్క్ బ్రేకు సెటప్ కూడా ఉంటుందని తెలుస్తోంది.(Bajaj CNG Bike)

Join WhatsApp