Bajaj Pulsar N160, N150 launched with super features

Bajaj Pulsar: మంచి బైక్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ బైక్స్ ని చూడాల్సిందే. స్మార్ట్‌ ఫీచర్లతో ఈ బైక్స్ వస్తున్నాయి. అప్‌డేటెడ్‌ స్మార్ట్‌ ఫీచర్లతో పల్సర్ N160 అలానే పల్సర్ N150లను బజాజ్‌ సంస్థ విడుదల చేయడం జరిగింది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. పూర్తిగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత తో పల్సర్‌ లైనప్‌ లో భారీ మార్పులు చేసింది కంపెనీ. ఇది వరకు పల్సర్ NS160 అలానే పల్సర్ NS200తో USD ఫ్రంట్ ఫోర్క్‌లను ని ఇచ్చింది కూడా. ఇక ఇప్పుడు అయితే పల్సర్ N150 అలానే పల్సర్ N160 లలో స్మార్ట్‌ ఫీచర్లను అందిస్తోంది.

Bajaj Pulsar N160, N150 launched with super features

2024 బజాజ్ పల్సర్ N160 పల్సర్ N150లు స్మార్ట్‌ఫోన్‌ అప్‌గ్రేడేషన్‌తో సంస్థ ప్రవేశపెట్టింది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ LCD క్లస్టర్‌ని కూడా ఇచ్చింది. అలానే బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌ తో వచ్చింది. బైక్‌ యూజర్లు స్మార్ట్‌ఫోన్‌తో పల్సర్ N160 మరియు N150తో కనెక్ట్ చేయవచ్చు. బైక్‌ రైడింగ్‌ చేసేటప్పుడు కాల్స్‌ని యాక్సెప్ట్‌ మరియు డిస్కనెక్ట్‌ చేసేందుకు వీలు అవుతుంది. మొబైల్ నోటిఫికేషన్ అలర్ట్స్‌, మొబైల్ సిగ్నల్ స్ట్రెంత్‌ అలానే బ్యాటరీ పర్సంటేజ్‌, గేర్ పొజిషన్ ఇండికేటర్, స్పేస్‌ డిస్టన్స్‌, ఇన్‌స్టంట్ ఫ్యూయల్ ఎకానమీ ని కూడా ఇచ్చారు. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ వంటి ఫీచర్లన్ని స్మార్ట్‌గా తెలీడానికి వీలుగా ఇచ్చారు. పల్సర్ N250 మాదిరిగానే డిజైన్ ని ఇచ్చారు. డిజైన్, ఛాసిస్ అలానే ఇతర బైక్‌ బయటి భాగాలు బాడీ ప్యానెల్‌లు, ప్యూయల్‌ ట్యాంక్ హెడ్‌ల్యాంప్ అసెంబ్లింగ్‌లు ముందు మోడల్స్‌ లానే ఉంటాయి. పల్సర్ N160 164.82cc DTS-i ఇంజన్ 15.8 bhp శక్తిని అలానే 14.65 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Also read: Dilraju: దిల్ రాజు ఇంట పెళ్లి సందడి.. ఆ స్టార్ హీరోకి ప్రత్యేక ఆహ్వానం..!

ఇంజన్ నుండి సుమారు 45 కి.మీ మైలేజీ అందిస్తుందని తెలుస్తోంది. పల్సర్ N150, 149.68cc ఇంజన్‌ 14.3 bhp మరియు 13.5 Nm శక్తిని ఇస్తుంది. రెండు బైక్స్‌లో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌లు ఇచ్చారు. బజాజ్ బెస్ట్-ఇన్-క్లాస్ పవర్ టార్క్, బెస్ట్-ఇన్-క్లాస్ పాసింగ్ యాక్సిలరేషన్ క్షణాల్లో 30-70 కి.మీ. వేగం తో ఉంటుంది. LED DRLలు, Bi-LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు అలానే గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటి ఫీచర్లతో N250 వంటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌లో వస్తుంది. యువ రైడర్‌లకు ఈ బైక్ నచ్చేస్తుంది (Bajaj Pulsar).

Join WhatsApp