Bikes that Indians like the most

Bikes: సాధారణంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే బైక్స్ లో హీరో టీవీఎస్, సుజుకి, కవసాకి, బజాజ్ కంపెనీలు ఉంటాయి. ఈ కంపెనీ నుంచి అతి తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఫీచర్స్ కలిగిన బైక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి పల్లెటూరులో ఎలాంటి రోడ్లలో అయినా నడిచే సామర్థ్యం కలిగినవి. అలాంటి వాటిలో ఇండియాలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కొన్ని బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Bikes that Indians like the most

బజాజ్ ప్లాటినా :
ఇండియన్ మార్కెట్ లో అత్యంత ఆదరణ పొందినటువంటి కంపెనీ బజాజ్. ఈ కంపెనీ నుంచి వచ్చిన బైక్స్ అత్యధిక మైలేజ్ అందిస్తాయి. ఇందులో ఆదరణ పొందిన బైక్ ప్లాటినా. దీని యొక్క ఎక్స్ షోరూం ధర రూ:67,808 ఉన్నది. అలాగే ఈ బైక్ 102 సిసి ఇంజన్, 5500 ఆర్పీయం వద్ద 8.3 న్యూటన్ టార్క్ అందిస్తుంది.(Bikes)

Also Read: Safest SUVs in India: ఇండియాలో 5 స్టార్ రేటింగ్ ఉన్న సేఫెస్ట్ SUV లు ఇవే

టీవీఎస్ స్పోర్ట్స్:
ఇండియన్స్ అత్యంత ఇష్టపడే మరో అతిపెద్ద బైక్ టీవీఎస్ స్పోర్ట్స్. ఈ బైక్స్ యొక్క ఎక్స్ షోరూం ధర రూ:61,600 నుంచి మొదలు రూ:69,873మధ్యలో ఉంది. ఇక దీని ఫీచర్స్ విషయానికి వస్తే ఇది 109.7 సీసీ ఇంజన్ కలిగి, 8.3 హార్స్ పవర్ అలాగే 8.7 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

 Bikes that Indians like the most

హోండా షైన్ 100:
ఇండియన్ ప్రజలు ఎంతో ఇష్టపడే మరో బైక్ హోండా షైన్ 100. దీని యొక్క ఎక్స్ షోరూం ధర రూ:64,900 ఉన్నది. అలాగే ఈ బైకులో 99.7సీసీ ఇంజన్ కలిగి ఉంది. 7.61 హార్స్ పవర్ మరియు 8.05 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్:
ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన మరో బైక్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్. ఈ బైక్స్ యొక్క ఎక్స్ షోరూం ధర రూ:59,998 నుంచి మొదలు రూ:68,768మధ్య ఉన్నది. ఈబైక్ ఇంజన్ విషయానికి వస్తే 97 సిసి ఇంజన్ ఉంటుంది.(Bikes)

Join WhatsApp