Bounce Infinity E1+: బెంగళూరుకు చెందిన ఈవీ తయారీ సంస్థ ‘బౌన్స్ ఇన్ఫినిటీ’ E1+ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద భారీ తగ్గింపును ప్రకటించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలను చూస్తే.. E1+ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద భారీ తగ్గింపును పొందవచ్చు. బౌన్స్ ఇన్ఫినిటీ సాధారణ ధర మార్కెట్లో రూ.1.13 లక్షలు. కంపెనీ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మరింత ఎక్కువమంది కస్టమర్ల కోసం ఏకంగా రూ. 24000 డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ తరువాత బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కేవలం రూ.89999 (ఎక్స్-షోషోరూమ్) మాత్రమే. వచ్చే నెల చివరి వరకు (2024 మార్చి 31) మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

Bounce Infinity E1+discount

చూడటానికి సింపుల్ డిజైన్ తో ఇది వుంది. ఒక సింగిల్ చార్జితో ఏకంగా 85 కిమీ కంటే ఎక్కువ రేంజ్ ని ఇది అందిస్తుంది. కనుక రోజువారీ వినియోగానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది. కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్ మార్చి 31 తరువాత అందుబాటులో ఉండకపోవచ్చు చూసుకొంది. బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2kwh లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది.

Also read: Bhatti: ఇంటర్నేషనల్ పాఠశాలలకు ధీటుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్..!

2.2 kW ఎలక్ట్రిక్ మోటారు గరిష్టంగా 65 కిమీగం వేగాన్ని అందిస్తుంది. గ్రే, బ్లూ, గ్రీన్, డార్క్ గ్రే మరియు ఎల్లో కలర్ లో ఇది అందుబాటులో వుంది. 15 Amp వాల్ సాకెట్ ద్వారా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. లైటింగ్ సిస్టం, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఆధునిక ఫీచర్స్ కూడా వున్నాయి. ఇప్పటికే కంపెనీ దేశ వ్యాప్తంగా ఉన్న అనేక ప్రధాన నగరాల్లో తన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను ఇది కలిగి ఉంది. రానున్న రోజుల్లో దీని నెట్‌వర్క్‌ మరింత పెరుగుతుందని.. మరిన్ని ప్రాంతాల్లో డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసి కస్టమర్లకు చేరువగా చేరుతుందని కంపెనీ అంటోంది (Bounce Infinity E1+).

Join WhatsApp