Bounce Infinity: New scooter powered by liquid cooled battery

Bounce Infinity: ప్రస్తుతం మార్కెట్లోకి ఎన్నో రకాల ఎలక్ట్రికల్ వాహనాలు వస్తున్నాయి. ఇందులో చాలావరకు కంపెనీలు రకరకాల ఫీచర్లతో మనకు అందిస్తున్నాయి. అయితే తాజాగా లిక్విడ్ కుల్డ్ బ్యాటరీ టెక్నాలజీతో నడిచే సరికొత్త స్కూటర్లను బౌన్స్ ఇన్ఫినిటీ కంపెనీ తీసుకువచ్చింది. ఇది ఇండియాలోకి వచ్చిన మొట్టమొదటి స్కూటర్ గా చెప్పవచ్చు. మరి స్కూటర్ యొక్క ప్రత్యేకతలు ఇతర వివరాలు చూద్దాం..

Bounce Infinity: New scooter powered by liquid cooled battery

క్లీన్ ఎలక్ట్రికల్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడిన ఈ సాంకేతికత వల్ల మెలుగైన బ్యాటరీ జీవితకాలం అందిస్తుంది. ఈ స్కూటర్ గురించి బౌన్స్ ఇన్ఫినిటీ సీఈవో వ్యవస్థాపకులు వివేకానంద హల్లేకేరే దీని రిలీజ్ సందర్భంగా ఇలా మాట్లాడారు. మా లిక్విడ్ కూల్డ్ బ్యాటరీలు పోర్టబుల్ మరియు ఏ స్టాండర్డ్ పై వద్ద సౌకర్యవంతంగా ఛార్జ్ చేయబడతాయని అన్నారు. రిఫ్రిజిరేటర్స్, హీటర్ల వంటి ఉపకరణాలు ఉపయోగించే మాదిరిగానే ప్రతి ఇంట్లో కనిపించే 15 ఏఎంపీ సాకెట్ లో ఫాస్ట్గా చార్జ్ చేయబడుతుంది.(Bounce Infinity)

Also Read: Jeep Compass Night Eagle: ఆకట్టుకునే స్టైల్ తో న్యూ కార్..ధర ఎంతంటే.?

ఇది 2.5 kwh కలిగి ఉంది. ఇది ఒక్క ఛార్జితో 112 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించగలదట. ఇందులో మునుపటి 1.9 కే డబ్ల్యూహెచ్ నుండి 85 కిలోమీటర్ల పరిధి అందిస్తోంది. ఇందులో అదనాతన సాంకేతికత కలిగి ఉందట. ఇక ఈ స్కూటర్ భద్రత కోసం లిక్విడ్ కూల్డ్ బ్యాటరీలు ఫైర్ రిటర్డెంట్ లిక్విడ్ ను ఉపయోగిస్తాయి. ఇది బ్యాటరీ నుండి వేడిని సమర్థవంతంగా గ్రహించి బాహ్య లోహ భాగాలకు బదిలీ చేస్తుంది.

Bounce Infinity: New scooter powered by liquid cooled battery

ఎయిర్ కూల్డ్ బ్యాటరీల వలె కాకుండా శితలీకరణ కోసం పరిసరాల గాలిపై ఆధారపడుతుంది. అంతే కాకుండా ఈ కొత్త బ్యాటరీ ప్యాక్ ఐదు లేయర్ల సేఫ్టీ ప్యాక్ తో వస్తుంది. ఎయిర్ కూల్డ్ బ్యాటరీల కంటే బ్యాటరీ ప్యాక్ 30-50% అత్యధిక మన్నిక అందించడంతో పాటు ఐదు సంవత్సరాల వరకు వారంటీ లభిస్తుందట. ఈ స్కూటర్ 40 నుంచి 50 నిమిషాలు 80% వరకు చార్జ్ అవుతుంది. అంతేకాకుండా ఈ స్కూటర్ ధర విషయానికి వస్తే భారతదేశం అంతటా రూ:99,210 ఎక్స్ షోరూం ప్రారంభ ధరతో లభిస్తున్నది.(Bounce Infinity)

Join WhatsApp