BYD SEAL: Amazing car.. 570km on one charge

BYD SEAL: ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల కార్ల కంపెనీలు ఉన్నాయి. ఇందులో డీజిల్, పెట్రోల్ తో నడిచే కార్లు ఎప్పటినుంచో మార్కెట్ నడుస్తున్నాయి. కానీ తాజాగా ఇండియన్ మార్కెట్లోకి కూడా ఎలక్ట్రికల్ కార్ల హవా పెరిగిపోతోంది. దీంతో చాలా కంపెనీలు వారి వారి కంపెనీల ఎలక్ట్రికల్ కార్లను రిలీజ్ చేస్తున్నాయి.

BYD SEAL: Amazing car.. 570km on one charge

ఇదే తరుణంలో బీల్డ్ యువర్ డ్రీమ్స్ అనే సంస్థ తన మూడవ ఎలక్ట్రికల్ కారును మార్చి 5వ తేదీన అట్టహాసంగా విడుదల చేయబోతోంది. మరి దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం.. ఈ యొక్క కారు కియా ఇవి 6, హ్యుందాయ్, అయోనిక్ 5 వంటి ఎలక్ట్రికల్ కార్లతో పోటీ పడుతున్నది. (BYD SEAL)

Also Read: Tvs Raider 125: ఇండియన్ మార్కెట్లో 7 లక్షలకు పైగా అమ్మకాలు.. ధర తక్కువ..!

ఇక దీని బ్యాటరీ విషయానికి వస్తే బివైడి సీల్ లో 82.5KWH సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాకుతో, ఎలక్ట్రిక్ సెడాన్ ఒకే ఛార్జ్ పై 570కీ”మీ”ప్రయాణం చేస్తుంది. అలాగే ఈ కారు 360 ఎన్ ఎం గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసే రియల్ యాక్సిస్ మౌంటెడ్ ఎలక్ట్రికల్ మోటార్ ఉంది. అంతేకాకుండా 230 బిహెచ్ ఫీ శక్తి అందజేస్తుందట. ఈ వాహనం కేవలం 6 సెకండ్లలో జీరో నుంచి 100 కిలోమీటర్లు వేగం అందుకోగలదు.

BYD SEAL: Amazing car.. 570km on one charge

ఈ వాహనంలో 15.6 అంగుళాలు టచ్ స్క్రీన్, 12స్పీకర్ ఆడియో సిస్టం, ఫనోరమిక్ సన్ రూఫ్, స్పోర్ట్స్ సీట్లు తిరిగే ట్రేడ్ మార్కు ఉన్నాయి. అంతేకాకుండా సీట్ ముందు స్టోరేజ్ స్పేస్, వెనుక భాగంలో 400 లీటర్ల స్పేస్ ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ ఇండియాలో తన డీలర్ షిప్ నెట్వర్క్ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.(BYD SEAL)

Join WhatsApp