Rolls Royce: A car that can go 100 km in 5 seconds

Car: చాలామంది కార్లు ని కొనుగోలు చేస్తూ ఉంటారు కార్లన్ని దూరం ప్రయాణాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు కార్లకి సంబంధించి రిపేర్లు వంటివి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా టైర్లు సమస్యలు కలగొచ్చు. కారుకి సంబంధించి ముఖ్యమైన భాగాల్లో టైర్లు ఎంతో ప్రధానమైనవి. కారుని నడపడానికి ఇంజన్ ఎంత ముఖ్యమో నాణ్యత కలిగిన టైర్లు కూడా చాలా అవసరం కారు బైక్ ఇలా ఏ వాహనం నడుపుతున్న టైర్లని మార్చే పరిస్థితి ఏర్పడుతుంది. వాహనం ఎక్కువ కాలం నడుస్తున్న కొద్ది టైర్లు అరిగిపోతూ ఉంటాయి వాటిని మార్చాల్సి ఉంటుంది. కొంతమందికి టైర్లని అరిగిపోతున్న సరే వాడేస్తూ ఉంటారు అలాంటి పొరపాటులు చేయకూడదు.

Car tyres mistakes

ఖర్చుని దృష్టిలో ఉంచుకుని నాణ్యతలేని టైర్లు కొనుగోలు చేస్తూ ఉంటారు ఇది అయితే చాలా ప్రమాదకరం రోడ్డుపై మీకే కాకుండా ఇతరులకి కూడా హానిని కలిగిస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. టైర్ యొక్క జీవితకాలం వాతావరణం రహదారి పరిస్థితిలో అలానే డ్రైవింగ్ అలవాట్లు మొదలైన వాటి మీద ఆధారపడి ఉంటుంది. కారు టైర్ల పనితీరు తగ్గిందని రీప్లేస్మెంట్ అవసరమని మీరు కనుక భావిస్తే వెంటనే ఆ పని చేయండి కొత్త టైర్లు కొనుగోలు చేయండి. టైర్ల ని కొనుగోలు చేసేటప్పుడు మంచి బ్రాండ్ టైర్లు కొనండి.

Also read: Health: పొట్ట కొవ్వును కరిగించి.. మిమ్మల్ని స్లిమ్ గా చేసే పండ్లు ఇవే..!

భారతీయ రహదారి పరిస్థితిలకి అనుకూలంగా ఐఎస్ఐ మార్కులు ఉన్న టైర్లని తీసుకోవడం మంచిది. చవకైన టైర్లు తీసుకుంటే ఎక్కువ కాలం రావు. పైగా దాని వలన లాభం కంటే నష్టమే ఉంటుంది. వాహనం పని తీరు భద్రత కోసం సరైన సైజు టైర్లు కొనుగోలు చేయాలి ప్రస్తుతం వాడుతున్న టైర్లని తనిఖీ చేయండి లేకపోతే మాన్యువల్ సెలెక్ట్ చేయండి. దీని వలన ఇబ్బందులు వస్తాయి టైర్ ని కొనుగోలు చేసేటప్పుడు టైర్లు తయారుచేసిన తేదీని టైర్ వైపు రాసి ఉంటుంది. దాని తనిఖీ చేయాలి పాత ని కొనుగోలు చేయకుండా ఉండడానికి సరైన ఆప్షన్ ఇది. సరికొత్తగా కనిపించే టైర్ ని కొనుగోలు చేసినప్పటికీ దానిపై ముద్రించిన తేదీని కచ్చితంగా చూసుకోండి ఇలా టైర్ల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు రావు లేకపోతే అనవసరంగా మీ ప్రయాణం సమయంలో ఇబ్బందులు వంటివి వస్తుంటాయి (Car).

Rolls Royce: A car that can go 100 km in 5 seconds
Join WhatsApp